Breaking News

Rohit-Kohli: ఒక్క మ్యాచ్‌లో ఓపెనర్లు బరిలోకి దిగితేనే ఇలా జరిగింది..!

Published on Mon, 06/03/2024 - 19:45

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా తరఫున ఓపెనర్‌గా రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి బరిలోకి దిగాలని తారా స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి.. రోహిత్‌ శర్మతో కలిసి ఒకే ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా  జత కట్టాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌ జోడీ చెలరేగిపోయింది.

2022 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వీరు కేవలం 54 బంతుల్లోనే 94 పరుగులు జోడించి, భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. టీ20ల్లో కోహ్లి అప్పటివరకు అడపాదడపా మాత్రమే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ సమయంలో కోహ్లి ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడో అని అభిమానులు తెగ టెన్షన్‌ పడ్డారు.

అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కోహ్లి 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. అప్పటికే రెగ్యులర్‌ ఓపెనర్‌గా స్థిరపడిన రోహిత్‌ సైతం ఆ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు.

వీరిద్దరితో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ (32 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (39 నాటౌట్‌) కూడా విజృంభించడంతో ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్‌ చేతులెత్తేయడంతో భారత్‌ ఆ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి-రోహిత్‌ ఓపెనర్లుగా జతకట్టాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ స్కోర్‌ కార్డు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కోహ్లి-రోహిత్‌ జోడీ ఒక్క మ్యాచ్‌లో జతకడితేనే ఈ స్థాయి విధ్వంసం జరిగింది. అదే వీరిద్దరు ప్రతి మ్యాచ్‌లో ఓపెనర్లు బరిలోకి దిగితే వీరిని ఆపడం సాధ్యమా అని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఇదివరకే ప్రూవ్‌ చేసుకున్న విరాట్‌.. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఓపెనర్‌గా అదిరిపోయే ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్నాడు. విరాట్‌ టీ20ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన 9 మ్యాచ్‌ల్లో 57.14 సగటున, 161.29 స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2024 సీజన్‌లో అరివీర భయంకర ఫామ్‌లో (741 పరుగులతో సీజన్‌ టాప్‌ స్కోరర్‌) ఉన్న కోహ్లి.. రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా జతకడితే ఈసారి టీమిండియా ప్రపంచకప్‌ గెలవడం ఖాయమని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు