Breaking News

T20 World Cup 2024: ఎట్టకేలకు బార్బడోస్‌ను వీడిన జగజ్జేతలు

Published on Wed, 07/03/2024 - 14:09

టీమిండియా క్రికెటర్లు ఎట్టకేలకు బార్బడోస్‌ను వీడారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత బృందాన్ని న్యూఢిల్లీకి చేర్చేందుకు ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం బార్బడోస్‌కు వచ్చింది.  ఇవాళ (జులై 3) మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్‌ అయినట్లు తెలుస్తుంది. రేపు ఉదయం 9 గంటల లోపు భారత క్రికెటర్లు ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా రాక కోసం భారత్‌లో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. 

కాగా, "బెరిల్‌" హరికేన్‌ (గాలివాన) కారణంగా టీమిండియా క్రికెటర్లు ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లో గత మూడు రోజులుగా ఇరుక్కుపోయారు. హరికేన్‌ తీవ్రరూపం దాల్చడంతో బార్బడోస్‌ ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేశారు. బార్బడోస్‌ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉండింది. భారత క్రికెటర్లు గత మూడు రోజులుగా హోటల్‌ రూమ్‌లకే పరిమితమయ్యారు.

ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత భారత్‌ పొట్టి ప్రపంచకప్‌తో స్వదేశానికి రానుంది. వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌ స్వదేశానికి తిరిగి రాగేనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. అనంతరం భారత ఆటగాళ్లు ముంబై నగర వీధుల్లో ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఊరేగింపుగా వెళ్తారని సమాచారం. గతంలో టీమిండియా వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు ఇలాగే చేశారు. 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)