టీ20 వరల్డ్‌కప్‌లో నేటి (జూన్‌ 21) మ్యాచ్‌.. ఇంగ్లండ్‌తో సౌతాఫ్రికా 'ఢీ'

Published on Fri, 06/21/2024 - 13:14

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఇవాళ (జూన్‌ 21) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సూపర్‌-8 గ్రూప్‌-2లో భాగంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు తలపడనున్నాయి. సెయింట్‌ లూసియా వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. భారతకాలమానం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా ఇదివరకే చెరో మ్యాచ్‌ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌.. వెస్టిండీస్‌పై, సౌతాఫ్రికా.. యూఎస్‌ఏపై గెలిచి చెరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి.  

ఈ టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై గెలిచి ఇంగ్లండ్‌ మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సౌతాఫ్రికా 4, ఇంగ్లండ్‌ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిసారి తలపడిన మ్యాచ్‌లో (2022) ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది.

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టులో ఓపెనర్లు సాల్ట్, బట్లర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌ పరంగా చూస్తే.. ఇంగ్లండ్‌ కంటే సౌతాఫ్రికా కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఆ జట్టు పేసర్లు ఓట్నీల్‌, రబాడ భీకర ఫామ్‌లో ఉన్నారు.

వాతావరణం విషయానికొస్తే.. నేటి మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదు. మ్యాచ్‌ జరిగే సమయానికి వాతావరణం ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సవ్యంగా సాగనుంది.

పిచ్‌ విషయానికొస్తే.. సెయింట్‌ లూసియా పిచ్‌ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో నమోదైన టాప్‌ స్కోర్లలో మెజార్టీ శాతం ఇక్కడ నమోదైనవే. ఈ వికెట్‌పై బౌలర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.

తుది జట్లు (అంచనా)..  

ఇంగ్లండ్‌: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)