T20 World Cup 2024: సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాలంటే 136 పరుగులు చేయాలి

Published on Mon, 06/24/2024 - 07:59

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-8 పోరులో ఇవాళ (జూన్‌ 24) సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు తలపడుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో వెస్టిండీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

తబ్రేజ్‌ షంషి తన స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్‌, మార్క్రమ్‌, కేశవ్‌ మహారాజ్‌, రబాడ తలో వికెట్‌ పడగొట్టారు. 

విండీస్‌ ఇన్నింగ్స్‌లో రోస్టన్‌ ఛేజ్‌ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్‌ మేయర్స్‌ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్‌ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్‌ 0, పూరన్‌ 1, రోవ్‌మన్‌ పావెల్‌ 1, రూథర్‌ఫోర్డ్‌ 0, రసెల్‌ 15, అకీల్‌ హొసేన్‌ 6 పరుగులకు ఔటయ్యారు. అల్జరీ జోసఫ్‌ (11 నాటౌట్‌), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. 10 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.  

కాగా, గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్‌ నుంచి రెండో బెర్త్‌ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ​్‌లో విండీస్‌ గెలిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా ఓడితే నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)