Breaking News

T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో విండీస్‌పై గెలుపు.. సెమీస్‌కు సౌతాఫ్రికా

Published on Mon, 06/24/2024 - 10:55

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో మరో ఉత్కంఠ పోరు జరిగింది. ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన సూపర్‌-8 సమరంలో సౌతాఫ్రికా చివరి ఓవర్‌లో విజయం సాధించింది. సౌతాఫ్రికా గెలుపుకు చివరి ఓవర్‌లో 5 పరుగులు అవసరం కాగా.. జన్సెన్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన జట్టుకు సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేశాడు.

వర్షం అంతరాయం నడుమ సాగిన ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. తబ్రేజ్‌ షంషి (4-0-27-3), జన్సెన్‌ (2-0-17-1), మార్క్రమ్‌ (4-0-28-1), కేశవ్‌ మహారాజ్‌ (4-0-24-1), రబాడ (2-0-11-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రోస్టన్‌ ఛేజ్‌ (52), కైల్‌ మేయర్స్‌ (35) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో  విండీస్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అనంతరం 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు అడ్డుతగిలాడు. రెండో ఓవర్‌లో మొదలైన వర్షం దాదాపు గంటపాటు కొనసాగడంతో 17 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించి, సౌతాఫ్రికా ముందు 123 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. వర్షం ప్రారంభానికి ముందే 2 వికెట్లు (15 పరుగులకే) కోల్పోయిన సౌతాఫ్రికా ఆతర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిపించింది. 

అయితే మార్కో జన్సెన్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (21 నాటౌట్‌) ఆడి సౌతాఫ్రికాను గెలిపించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29), క్లాసెన్‌ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్‌ బౌలర్లు రోస్టన్‌ ఛేజ్‌ (3-0-12-3), ఆండ్రీ రసెల్‌ (4-0-19-2), అల్జరీ జోసఫ్‌ (4-0-25-2) దక్షిణాఫ్రికా శిబిరంలో ఆందోళన రేకెత్తించారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో విండీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏపై గెలుపుతో గ్రూప్‌-2 నుంచి సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ నిలిచింది. గ్రూప్‌-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ సెమీస్‌కు చేరగా.. విండీస్‌, యూఎస్‌ఏ టోర్నీ నుంచి వైదొలిగాయి.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)