Breaking News

T20 1st Semis: చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఫైనల్లో సౌతాఫ్రికా

Published on Thu, 06/27/2024 - 06:41

చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఫైనల్లో సౌతాఫ్రికా
టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (జూన్‌ 27) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా 8.5 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు (వికెట్‌ కోల్పోయి) చేరింది.

టార్గెట్‌ 57.. 5 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
57 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 5 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఫజల్‌ హక్‌ బౌలింగ్‌లో డికాక్‌ (5) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

11.5 ఓవర్లలో 56 పరుగులకు అప్ఘనిస్తాన్‌ ఆలౌట్‌.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 57 పరుగులు

50 పరుగులకే తొమ్మిది వికెట్లు డౌన్‌
ఆఫ్ఘనిస్తాన్‌ ఒకే స్కోర్‌ వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. 50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌
ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి ఘోర పతనం దిశగా సాగుతుంది. షంషి బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్‌ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ స్కోర్‌ 50/8గా ఉంది. రషీద్ ఖాన్‌ (8), నవీన్‌ ఉల్‌ హక్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు.

50 పరుగుల వద్ద ఏడో వికెట్‌ డౌన్‌
50 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. తబ్రేజ్‌ షంషి బౌలింగ్‌లో కరీమ్‌ జనత్‌ (8) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 

28 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌
ఆఫ్ఘనిస్తాన్‌ 28 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ట్రిస్టన్‌​ స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఒమర్‌జాయ్‌ (10) ఔటయ్యాడు. కరీమ్‌ జనత్‌ (4), రషీద్‌ ఖాన్‌ (8) క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ స్కోర్‌ 45/6గా ఉంది

ట్రినిడాడ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌ 2024 తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు టాస్‌ గెలిచిమాన్న సంతోషం ఎంతో సేపు నిలబడలేదు. సఫారీ పేసర్లు రెచ్చిపోవడంతో ఆఫ్ఘన్లు 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. గుర్బాజ్‌ (0), ఇబ్రహీం జద్రాన్‌ (2), గుల్బదిన్‌ నైబ్‌ (9), మొహమ్మద్‌ నబీ (0), ఖరోటే (2) దారుణంగా విఫలమయ్యారు. జన్సెన్‌ (3-0-16-3) ఆఫ్ఘన్లను దెబ్బకొట్టాడు. రబాడ (2-1-5-2) మరో చేయి వేశాడు.

తుది జట్లు..
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, కరీం జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్‌), నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫారూఖీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌