Breaking News

T20 World Cup 2024: చెత్త రికార్డు సమం చేసిన శ్రీలంక

Published on Mon, 06/03/2024 - 21:17

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గ్రూప్‌-డిలో భాగంగా ఇవాళ (జూన్‌ 3) శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. న్యూయార్క్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక  టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే అంచనాతో తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్నట్లు లంక కెప్టెన్‌ హసరంగ టాస్‌ సందర్భంగా చెప్పాడు. 

అయితే ఈ విషయంలో హసరంగ అంచనాలు తారుమారయ్యాయి. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. 45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 

తొలుత ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (2-1-3-1), ఆతర్వాత కేశవ్‌ మహారాజ్‌ (4-0-22-2), అన్రిచ్‌ నోర్జే (3-0-6-3) లంకేయులకు దారుణంగా దెబ్బ తీశారు. నిస్సంక (3), కుశాల్‌ మెండిస్‌ (19), కమిందు మెండిస్‌ (11), హసరంగ (0), సమరవిక్రమ (0), అసలంక (6) దారుణంగా విఫలం కాగా.. ఏంజెలో మాథ్యూస్‌ (9), దసున్‌ షనక (9) లంకను మూడంకెల స్కోర్‌ దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. 14 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 61/6గా ఉంది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓ చెత్త రికార్డు సమం చేసింది. టీ20 వరల్డ్‌కప్‌ పవర్‌ ప్లేల్లో (తొలి 6 ఓవర్లు) తమ అత్యల్ప స్కోర్‌ను సమం చేసింది. ఈ మ్యాచ్‌ పవర్‌ ప్లేలో శ్రీలంక వికెట్‌ నష్టానికి 24 పరుగులు చేసింది. 2022 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీలంక 24 పరుగులకే పరిమితమైంది.  అయితే మ్యాచ్‌లో శ్రీలంక ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది. టీ20 ప్రపంచకప్‌ పవర్‌ ప్లేల్లో శ్రీలంక మూడో అత్యల్ప స్కోర్‌ 2007లో నమోదైంది. కేప్‌టౌన్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 4 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేశారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)