Breaking News

T20 World Cup 2024: ఆసీస్‌పై టీమిండియా విజయం.. హిట్‌మ్యాన్‌ ఖాతాలో రికార్డుల వెల్లువ

Published on Tue, 06/25/2024 - 09:09

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ (41 బంతుల్లో 92; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. 

హిట్‌మ్యాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా 181 పరుగులకే ( 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి) పరిమితమై 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

ట్రవిస్‌ హెడ్‌ (76) ఆసీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/37), కుల్దీప్‌ యాదవ్‌ (2/24) ఆసీస్‌ విజయాన్ని అడ్డుకున్నారు. బుమ్రా, అక్షర్‌ తలో వికెట్‌ తీశారు. సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగి టీమిండియాను గెలిపించిన రోహిత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సాధించిన రికార్డులు..

అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) ఒకే ప్రత్యర్థిపై (ఆస్ట్రేలియాపై) అత్యధిక సిక్సర్లు (132 సిక్సర్లు) కొట్టిన బ్యాటర్‌గా రికార్డు

బాబర్‌ ఆజమ్‌ను (4145) అధిగమించి అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు (4165)

టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్‌ (92) సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు

పొట్టి ప్రపంచకప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డు అందుకున్న తొలి భారత కెప్టెన్‌గా రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు (529)

అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఓ మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్సర్లు (8) బాదిన భార‌త బ్యాటర్‌గా రికార్డు

ప్రస్తుత ప్రపంచకప్‌ (2024)లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి (19 బంతుల్లో) రికార్డు
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)