Breaking News

నా కుమారుడు వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన

Published on Wed, 05/01/2024 - 16:57

టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం టీమిండియాను నిన్న (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే మెజార్టీ శాతం​ ఎంపికలు జరిగినప్పటికీ.. రింకూ సింగ్‌ లాంటి టాలెంటెడ్‌ ఆటగాడిపై శీతకన్ను చూపడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సెలెక్టర్లు రింకూను ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ఆటగాడిగా ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారు. 

రింకూ సింగ్‌కు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కకపోవడంపై చాలామంది మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ లాంటి మ్యాచ్‌ ఫినిషర్‌ను వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేయనందుకు సెలెక్టర్లను నిందించారు. ఈ క్రమంలో రింకూ సింగ్‌ తండ్రి  ఖన్‌చంద్ర సింగ్‌ స్పందించాడు.

 ఓ స్థానిక న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ ఇలా అన్నాడు. రింకూ వరల్డ్‌కప్‌ జట్టులో ఉంటాడని మాకు పూర్తి నమ్మకం ఉండింది. సంబురాలు చేసుకునేందుకు స్వీట్లు, టపాసులు కూడా తెచ్చుకున్నాం. రింకూ వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికవడమే కాకుండా తుది జట్టులో కూడా ఉంటాడని ఊహించాం. 

మా దురదృష్టం కొద్ది అలా జరగలేదు. రింకూ గుండె పగిలిపోయినంత పనైపోయింది. రింకూ ఈ విషయంలో తన తల్లికి చాలా సర్దిచెప్పాడు. 15 మందిలో లేనపోయినా జట్టుతో పాటు వెళ్తానని ఆమెతో చెప్పాడు. కాగా, 26 ఏళ్ల రింకూ టీమిండియా తరఫున 15 టీ20ల్లో 176.2 స్ట్రయిక​్‌రేట్‌తో 89 సగటున 356 పరుగులు చేశాడు. ఇం​దులో 2 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా

ట్రావెలింగ్‌ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)