Breaking News

కోహ్లికి 121 మ్యాచ్‌లు అవసరమైతే.. సూర్యకుమార్‌ కేవలం 64 మ్యాచ్‌ల్లోనే సాధించాడు..!

Published on Fri, 06/21/2024 - 07:11

గత రెండేళ్లుగా నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా చలామణి అవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్‌ యాదవ్‌ పొట్టి క్రికెట్‌లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు (15) గెలుచుకున్న ఆటగాడిగా విరాట్‌ కోహ్లి రికార్డును సమం చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024 సూపర్‌-8 మ్యాచ్‌ల్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకోవడం ద్వారా స్కై ఈ రికార్డు నెలకొల్పాడు.

విరాట్‌కు 15 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్‌లు అవసరమైతే.. స్కై కేవలం 64 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో స్కై, విరాట్‌ తర్వాత విరన్‌దీప్‌ సింగ్‌ (14), సికందర్‌ రజా (14), మొహమ్మద్‌ నబీ (14) ఉన్నారు.

భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ మెరుపు అర్దశతకం (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచున్నాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి (24), రిషబ్‌ పంత్‌ (20),  హార్దిక్‌ పాండ్యా (32) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. రోహిత్‌ శర్మ (8), శివమ్‌ దూబే (10), రవీంద్ర జడేజా (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (12) ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. నవీన్‌ ఉల్‌ హక్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

నిప్పులు చెరిగిన బుమ్రా..
182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌.. బుమ్రా (4-1-7-3) నిప్పులు చెరగడంతో 134 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3, కుల్దీప్‌ 2, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)