Breaking News

జకోవిచ్‌ స్టయిల్‌లో సెలబ్రేట్‌ చేసుకున్న రోహిత్‌ శర్మ

Published on Sun, 06/30/2024 - 15:11

టీ20 వరల్డ్‌కప్‌ 2024ను కైవసం చేసుకున్న అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ...టెన్నిస్‌ లెజెండ్‌ నొవాక్‌ జకోవిచ్‌ స్టయిల్‌లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం హిట్‌మ్యాన్‌ పిచ్‌పై ఉన్న గడ్డిపరకలను నోట్లో పెట్టుకుని విన్నింగ్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. టెన్నిస్‌ దిగ్గజం​ జకోవిచ్‌ సైతం గ్రాండ్‌స్లామ్‌ విజయానంతరం ఇలాగే చేస్తాడు. 

జకో.. ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిచాక కోర్టులోని గడ్డిపరకలను లేదా మట్టిని నోట్లో పెట్టుకుని గెలుపు సంబురాలు చేసుకుంటాడు. వరల్డ్‌కప్‌ విజయానంతరం రోహిత్‌ చేసుకున్న జకో స్టయిల్‌ సెలబ్రేషన్స్‌ నెట్టింట వైరలవుతున్నాయి. వింబుల్డన్‌ తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో జకోవిచ్‌, రోహిత్‌ శర్మ గడ్డి తింటున్న ఫోటోలు పోస్ట్‌ చేసి.. GOATs eating grass అని కామెంట్‌ పెట్టింది. ఈ పోస్ట్‌ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.

కాగా, నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో సారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు 11 ఏళ్ల తర్వాత లభించిన తొలి ఐసీసీ ట్రోఫీ ఇది. 2013లో టీమిండియా ధోని నేతృత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించింది. 

వరల్డ్‌కప్‌ విషయానికొస్తే.. టీమిండియాకు 13 ఏళ్ల తర్వాత లభించిన తొలి వరల్డ్‌కప్‌ ఇది. 2011లో భారత్‌..ధోని నేతృత్వంలో వన్డే వరల్డ్‌కప్‌ సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌ విషయానికొస్తే.. ధోని సారథ్యంలో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ సాధించిన టీమిండియా.. 17 ఏళ్ల తర్వాత తిరిగి పొట్టి ప్రపంచకప్‌ను దక్కించుకుంది. ఈసారి రోహిత్‌ శర్మ టీమిండియాకు పొట్టి ప్రపంచకప్‌కు అందించాడు.

ఫైనల్‌ మ్యాచ్‌ స్కోర్‌ వివరాలు..
భారత్‌ 176/7
సౌతాఫ్రికా 169/8
7 పరుగుల తేడాతో భారత్‌ విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌- విరాట్‌ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)

ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌- జస్ప్రీత్‌ బుమ్రా (8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు)
 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)