Breaking News

T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో తొలిసారి ఇలా..!

Published on Sat, 06/29/2024 - 13:51

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో ఇవాళ (జూన్‌ 29) భారత్‌, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బార్బడోస్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టైటిల్‌ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇందు కోసం ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలు సిద్దం చేసుకున్నాయి. వరల్డ్‌కప్‌ గెలవడం ఓ జట్టుకు (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ అయితే.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక.

ప్రపంచ కప్‌లో తొలిసారి ఇలా..
ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌, సౌతాఫ్రికా అజేయ జట్లుగా ఫైనల్‌కు చేరాయి. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇలా (ఫైనల్‌కు చేరిన జట్లు అజేయ జట్లుగా నిలవడం) జరగడం ఇదే తొలిసారి.

ఈ మెగా సమరానికి ముందు పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్లు ఎన్ని సార్లు ఎదురెదురుపడ్డాయో ఓ లుక్కేద్దాం. ఈ ఫార్మాట్‌లో భారత్‌-సౌతాఫ్రికా పోరాటం​ 18 ఏళ్ల కిందట మొదలైంది. జోహనెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్రొటీస్‌ను ఖంగుతినిపించింది. ఆ మ్యాచ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఆడిన ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌.

టీమిండియాదే ఆధిక్యం
అప్పటి నుంచి పొట్టి క్రికెట్‌లో భారత్‌-సౌతాఫ్రికా జట్లు 26 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. టీమిండియా 14, సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. సౌతాఫ్రికాపై భారత్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఆరు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. భారత్‌ 4, సౌతాఫ్రికా 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన వరల్డ్‌కప్‌ (2022 ఎడిషన్‌) మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది.

 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)