Breaking News

'పర్ఫెక్ట్‌ రివెంజ్‌' అంటే ఇదే.. ఇంగ్లండ్‌ లెక్క సరి చేసిన టీమిండియా

Published on Fri, 06/28/2024 - 09:11

టీ20 వరల్డ్‌కప్‌ 2024 రెండో సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. గత వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌ టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇందుకు ప్రతిగా టీమిండియా ప్రస్తుత ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌ 10 వికెట్లు పడగొట్టి చిత్తు చేసింది. టీమిండియా ఇంగ్లండ్‌ లెక్క సరి చేయడంతో భారత క్రికెట్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'పర్ఫెక్ట్‌ రివెంజ్‌' అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

2022 ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమిండియాను ఓడించి ఫైనల్స్‌కు చేరిన ఇంగ్లండ్‌.. తుది సమరంలో పాకిస్తాన్‌ను ఓడించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌కు ఓడించి ఫైనల్స్‌కు చేరని భారత్‌.. తుది సమరంలో సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందని భారత క్రికెట్‌ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా,  నిన్న (జూన్‌ 27) జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచకప్‌  ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రోహిత్‌ శర్మ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 23, ఫోర్‌, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోహ్లి (9), దూబే (0) మరోసారి విఫలం కాగా.. పంత్‌ (4) నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్‌ టాప్లీ, జోఫ్రా ఆర్చర్‌, సామ్‌ కర్రన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో దక్కించుకున్నారు.

అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (4-0-19-3), అక్షర్‌ పటేల్‌ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌ (23), హ్యారీ బ్రూక్‌ (25), జోఫ్రా ఆర్చర్‌ (21), లివింగ్‌స్టోన్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, భారతకాలమానం రేపు (జూన్‌ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)