Breaking News

T20 WC 2021: బాగా రాణిస్తున్నాడు.. జట్టులో చోటు మాత్రం కష్టమే

Published on Wed, 10/13/2021 - 18:52

Sunil Narine Wont Include In West Indies T20 Sqaud.. అక్టోబర్‌ 17 నుంచి టి20 ప్రపంచకప్‌ 2021 ప్రారంభం కానున్న సందర్భంగా అన్ని జట్లు తమ సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆయా దేశాలు తమ జట్లలో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చవని.. అక్టోబర్‌ 15వ తేదీ వరకు చివరి అవకాశం ఉందని ఐసీసీ ఇ‍ప్పటికే ప్రకటించింది. కాగా టి20 ప్రపంచకప్‌కు సంబంధించి విండీస్‌ జట్టుకు సునీల్‌ నరైన్‌ ఎంపిక కాలేదు. అయితే ఐపీఎల్‌ 2021 సీజన్‌లో కేకేఆర్‌ తరపున ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా ఆర్‌సీబీతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన నరైన్‌ బౌలింగ్‌లో 4 వికెట్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో 26 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా కేకేఆర్‌ తరపున 8 మ్యాచ్‌లాడి 6.12 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. దీంతో నరైన్‌ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న కరీబియన్‌ ఫ్యాన్స్‌ విండీస్‌ టి20 ప్రపంచకప్‌ జట్టులో చోటు కల్పించాలని పెద్ద ఎత్తున కోరారు.

చదవండి: T20 World Cup 2021: టీమిండియాలో అనూహ్య మార్పు..

అయితే వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ నరైన్‌ బాగా రాణిస్తున్నప్పటికీ విండీస్‌ జట్టులో చోటు దక్కడం కష్టమే అని తెలిపాడు. ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పొలార్డ్‌ మాట్లాడాడు. '' ఐపీఎల్‌ 2021 జరుగుతున్న యూఏఈ గడ్డపై నరైన్‌ బాగా రాణిస్తున్నాడు. నరైన్‌ మొదట నాకు మంచి స్నేహితుడు. ఆ తర్వాత అతనొక వరల్డ్‌ క్లాస్‌ క్రికెటర్‌. అయితే ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌కు జట్టుకు ఎంపికైన 15 మంది ప్రత్యేక శైలి కలిగిన వారే. ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టును మార్చి నరైన్‌కు అవకాశం ఇవ్వలేము. అయితే ఎంపిక నా చేతుల్లో ఉండదు. సెలెక్టర్లు నన్ను సంప్రదిస్తే నరైన్‌ పేరు కచ్చితంగా పేర్కొంటా. కానీ ఆ అవకాశం లేకపోవచ్చు.'' అని చెప్పుకొచ్చాడు.  ఇక టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ సూపర్‌ 12లో గ్రూఫ్‌ 1లో ఉంది. విండీస్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 23న ఇంగ్లండ్‌తో ఆడనుంది.

చదవండి: T20 World Cup 2021: హార్దిక్‌ అన్‌ఫిట్‌..  జట్టులోకి మరో ఆల్‌రౌండర్‌!

Chris Gayle: ఆ క్రికెటర్‌పై గౌరవం చచ్చిపోయింది.. గేల్‌ సంచలన వ్యాఖ్యలు

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)