Breaking News

అలా జరిగితే అఫ్గాన్‌ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్‌

Published on Thu, 09/23/2021 - 20:25

ICC Warns Afghanistan Cricket Team: క్రికెట్‌ బోర్డుల వ్యవహారాల్లో ఆయా దేశాల ప్రభుత్వాల జోక్యాన్ని సహించేది లేదని ఐసీసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెలలో ఆఫ్గనిస్థాన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఆ దేశ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) అధ్యక్షడిని సైతం మార్చేసి వారికి అనుకూలంగా ఉండే వ్యక్తిని నియమించుకోవడంతో పాటు ఆ దేశ అమ్మాయిలను క్రికెట్‌ ఆడకుండా నిషేధించారు.  

ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ జాతీయ పతాకానికి బదులు తమ జెండా పెట్టాలని తాలిబన్లు  డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే.. అఫ్గాన్‌ జట్టును బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని ఐసీసీ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే ఐసీసీ నియమాలు తప్పకుండా పాటించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు మొత్తం 8 జట్లు అర్హత సాధించగా, అందులో అప్గాన్‌ జట్టు ఒకటి. ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో బలమైన జట్టుగా ఎదిగిన  అఫ్గానిస్థాన్‌ జట్టు ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉంది. 
చదవండి: ఆ క్రికెట్‌ సిరీస్‌ కోసం ఇద్దరు ప్రధానుల మధ్య చర్చ..

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)