థాంక్యూ పీఎం సార్‌.. చాలా సంతోషంగా ఉంది: విరాట్‌ కోహ్లి

Published on Thu, 07/04/2024 - 16:27

టీ20 వరల్డ్‌కప్‌ను సాధించి 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరిదించిన భార‌త జ‌ట్టు ఎట్ట‌కేల‌కు సొంత గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న రోహిత్ సేన‌కు ఆపూర్వ స్వాగ‌తం ల‌భించింది.

ఎయిర్ పోర్ట్‌కు భారీగా చేరుకున్న అభిమానులు టీమిండియాకు జేజేలు పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని భారత జట్టు తన నివాసంలో కలిసింది.  ప్ర‌ధానితో క‌లిసి వారు అల్పాహారం చేశారు. ఈ సంద‌ర్భంగా మోదీ ప్ర‌తి క్రికెట‌ర్ వ‌ద్దకు వెళ్లి అప్యాయంగా ప‌ల‌క‌రించి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో భారత జట్టు ఢిల్లీ నుంచి ముంబైకు పయనమైంది.

ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి స్పందించాడు.  విరాట్ సోషల్‌ మీడియా వేదికగా  ప్రధానికి  కృతజ్జతలు తెలిపాడు.

"ఈ రోజు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. మమ్మల్ని మీ నివాసానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ అంటూ" కోహ్లి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. మరోవైపు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సైతం సోషల్ మీడియా మోదీకి ధన్యవాదాలు తెలిపాడు.
చదవండి: T20 WC 2024: రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్‌.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై


 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)