Breaking News

T20 WC : సౌతాఫ్రికాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ

Published on Wed, 02/04/2026 - 22:38

టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా నవీముంబై వేదికగా   సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా  విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 240 పరుగుల  భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 210 పరుగుల వద్దే నిలిచింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో  ఐదెన్ మార్‌క్రమ్ 38 పరుగులు, ర్యాన్ రెకెల్‌టెన్ 44 పరుగులు చేశారు

భారత్ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్‌ దంచికొట్టి రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగారు.

ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్‌ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్‌ పేసర్‌ మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన తిలక్‌ హాఫ్‌ సెంచరీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాష్, అన్రిచ్‌ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

కాగా భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)