ఓటమి బాధలో ఉన్న విండీస్‌కు బిగ్‌ షాక్‌.. టోర్నీ నుంచి స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌?

Published on Thu, 06/20/2024 - 11:41

టీ20 వరల్డ్‌కప్‌ గ్రూపు స్టేజిలో అజేయంగా నిలిచిన వెస్టిండీస్‌కు సూపర్‌-8లో బిగ్‌ షాక్‌ తగిలింది. సెయింట్‌ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ ఓటమి పాలైంది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విండీస్‌ బౌలర్లు విఫలమయ్యారు. 

181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్‌ జట్టు 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌( 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 నాటౌట్‌) అద్బుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు.

విండీస్‌కు బిగ్‌ షాక్‌..
ఇక ఓటమి బాధలో ఉన్న కరేబియన్‌ జట్టుకు మరో బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ బ్రాండెన్‌ కింగ్‌ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్‌ గాయపడ్డాడు. సామ్‌కుర్రాన్‌ బౌలింగ్‌లో కవర్స్‌ దిశగా షాట్ ఆడే సమయంలో కింగ్‌ పక్కటెముకలకు గాయమైంది. దీంతో  హఠాత్తుగా తీవ్రమైన నొప్పితో కింగ్‌ విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడి నొప్పి మాత్రం తగ్గలేదు. 

దీంతో ఫిజియో సాయంతో కింగ్‌ మైదానాన్ని వీడాడు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. అయితే కింగ్‌ గాయంపై విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఎటువంటి ప్రకటన చేయలేదు. విండీస్‌ తమ తదుపరి మ్యాచ్‌లో జూన్‌ 22న అమెరికాతో తలపడనుంది.
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)