చెలరేగిన జోన్స్‌.. నేపాల్‌ టార్గెట్‌ ఎంతంటే..?

Published on Tue, 02/17/2026 - 21:09

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 17) రాత్రి 7 గంటలకు మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో స్కాట్లాండ్‌, నేపాల్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేసింది.

ఓపెనర్‌ మైఖేల్‌ జోన్స్‌ (45 బంతుల్లో 71; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్కాటిష్‌ ఇన్నింగ్స్‌లో జోన్స్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 

మరో ఓపెనర్‌ జార్జ్‌ మున్సే (27), బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (25), కెప్టెన్‌ రిచీ బెర్రింగ్టన్‌ (10), మార్క్‌ వాట్‌ (10 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో టామ్‌ బ్రూస్‌ (5), మాథ్యూ క్రాస్‌ (4), మైఖేల్‌ లీస్క్‌ (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.

నేపాల్‌ బౌలర్లలో సోమ్‌పాల్‌ కామీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇతను 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. మరో బౌలర్‌ నందన్‌ యాదవ్‌ కూడా పర్వాలేదనిపించాడు. ఇతను 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

కుషాల్‌ భుర్టెల్‌, కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ తలో వికెట్‌ తీశారు. ఓ దశలో భారీ చేస్తుందనుకున్న స్కాట్లాండ్‌ చివర్లో త్వరితగతిన వికెట్లు కోల్పోయి ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది.

అనంతరం​ ఛేదనకు దిగిన నేపాల్‌ ఆచితూచి ఆడుతుంది. తొలి 4 ఓవర్లలో ఆ జట్టు వికెట్లు కోల్పోకుండా 26 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు కుషాల్‌ భుర్టెల్‌ 14, ఆసిఫ్‌ షేక్‌ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ గెలవాలంటే మరో 145 పరుగులు చేయాలి.

​

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)