IND vs PAK: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌!

Published on Fri, 02/13/2026 - 18:12

అవాంతరాలన్నీ తొలగి భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) జో​క్యంతో దిగివచ్చిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తాము టీమిండియాతో ఆడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాయాదుల పోరును వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్న అభిమానులకు ఓ చేదు వార్త.

సాంకేతికంగా మ్యాచ్‌ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయినా.. వాతావరణం ఇందుకు సహకరించేలా కనిపించడం లేదు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఫిబ్రవరి 7న భారత్‌- శ్రీలంక వేదికగా మొదలైన విషయం తెలిసిందే.

అగ్రస్థానంలో టీమిండియా
మొత్తంగా ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా టీమిండియా అమెరికా, నమీబియాలపై గెలుపొందగా.. పాక్‌ జట్టు నెదర్లాండ్స్‌, అమెరికాలపై జయభేరి మోగించింది.

ఫలితంగా గ్రూప్‌-ఎ నుంచి చెరో రెండు విజయాలతో భారత్‌- పాక్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నా.. నెట్‌ రన్‌రేటు పరంగా భారత్‌ (+3.050).. పాకిస్తాన్‌ (+0.932) కంటే అత్యంత పటిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ఫిబ్రవరి 15న తలపడాల్సి ఉంది.

వాన పడే అవకాశం
శ్రీలంకలోని ​కొలంబోలో గల ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్‌- పాక్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌ ఆరంభం కానుంది. అయితే, ఈ దాయాదుల పోరుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఆదివారం ఉదయం వర్షం కురిసేందుకు 93 శాతం అవకాశం ఉంది.

అంతేకాదు.. 26 శాతం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. అయితే, సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలూ కూడా ఉన్నాయి. వాన పడే ఛాన్స్‌ 13 శాతానికి తగ్గనుందని ఆక్యూవెదర్‌ వెల్లడించింది.

యూటర్న్‌ తీసుకున్న పాక్‌
ఇక మ్యాచ్‌ మొదలయ్యే సమయానికి వాన తగ్గే అవకాశం ఉన్నా.. ఒకవేళ రోజంతా వర్షం కురిస్తే అవుట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారే ప్రమాదం ఉంది. ఇది కూడా మ్యాచ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్‌తో ఎనిమిది సార్లు ముఖాముఖి తలపడ్డ భారత్‌ 7-1 (విజయాలు)తో ఆధిపత్యం కొనసాగిస్తోంది. 

కాగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టీ20 వరల్డ్‌కప్‌-2026 బహిష్కరిస్తామంటూ పాక్‌ తొలుత ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేవలం భారత్‌తో మాత్రమే ఆడమంటూ నాటకాలు ఆడగా.. ఐసీసీ రంగంలోకి దిగడంతో యూటర్న్‌ తీసుకుంది.

చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్‌ మాజీ క్రికెటర్‌పై భజ్జీ ఆగ్రహం

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)