Breaking News

T20 WC 2026: పసికూనపై ఆస్ట్రేలియా ప్రతాపం

Published on Wed, 02/11/2026 - 19:19

టీ20 ప్రపంచకప్‌ 2026లో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. 45 పరుగులు చేసిన మార్కస్‌ స్టోయినిస్‌ టాప్‌​ స్కోరర్‌గా నిలిచాడు. జోష్‌ ఇంగ్లిస్‌, మ్యాట్‌ రెన్‌షా తలో 37 పరుగులు.. కూపర్‌ కన్నోలీ, జేవియర్‌ బార్ట్‌లెట్‌ చెరో అజేయమైన 11 పరుగులు.. తాత్కాలిక కెప్టెన్‌ ట్రవిస్‌ హెడ్‌ , గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 9 పరుగులు చేశారు. 

ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అదైర్‌ 2, మాథ్యూ హంఫ్రేస్‌, జార్జ్‌ డాక్రెల్‌, హ్యారీ టెక్టార్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆడమ్‌ జంపా (4-0-23-4), నాథన్‌ ఎల్లిస్‌ (3.5-1-12-4) ధాటికి 16.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. మిగతా ఆసీస్‌ బౌలర్లలో కుహ్నేమన్‌ (4-0-29-1) కూడా రాణించాడు. 

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జార్జ్‌ డాక్రెల్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. డాక్రెల్‌ ఈ స్కోర్‌ చేయకపోయుంటే ఐర్లాండ్‌ 100 పరుగుల మార్కును కూడా దాటలేకపోయేది. మిగతా ఐరిష్‌ బ్యాటర్లలో లోర్కన్‌ టక్కర్‌ (24), రాస్‌ అదైర్‌ (12), గెరాత్‌ డెలానీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు