Breaking News

'బాస్‌' ఆల్‌రౌండ్‌ షో.. పసికూనల పోరులో నెదర్లాండ్స్‌ గెలుపు

Published on Tue, 02/10/2026 - 15:18

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 10) ఉదయం (11 గంటలకు) జరిగిన పోరులో పసికూనలు నెదర్లాండ్స్‌, నమీబియా తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ పైచేయి సాధించింది. బాస్‌ డి లీడ్‌ ఆల్‌రౌండ్‌ మెరుపుల కారణంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

లీడ్‌ తొలుత బంతితో (3-0-20-2), ఆతర్వాత బ్యాట్‌తో (48 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటి నెదర్లాండ్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ గెలుపుతో నెదర్లాండ్స్‌ ప్రస్తుత ఎడిషన్‌లో బోణీ కొట్టింది. ఈ జట్టు తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఖంగుతింది. మరోవైపు నబీమియాకు ఇదే తొలి మ్యాచ్‌. తొలి మ్యాచ్‌లోనే ఆ జట్టు పరాజయంపాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జాన్‌ ఫ్రైలింక్‌ (30), జాన్‌ నికోల్‌ లాఫ్టీ ఈటన్‌ (42) ఓ మోస్తరు స్కోర్లు సాధించి నమీబియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. మిగతా బ్యాటర్లలో జేజే స్మిట్‌ (22), కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లొగన్‌ వాన్‌ బీక్‌, బాస్‌ డి లీడ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్‌ దత్‌, ఫ్రెడ్‌ క్లాస్సెన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని నెదర్లాండ్స్‌ సునాయాసంగా ఛేదించింది. బాస్‌ డి లీడ్‌ అజేయమైన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. లీడ్‌తో పాటు కొలిన్‌ ఆకెర్‌మన్‌ (32), మైఖేల్‌ లెవిట్‌ (28), స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (18 నాటౌట్‌) కూడా రాణించడంతో నెదర్లాండ్స్‌ 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్‌ స్కోల్జ్‌, రూబెన్‌ ట్రంపెల్మన్‌, నికోల్‌ లాఫ్టీకి తలో వికెట్‌ దక్కింది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)