Breaking News

అఫ్గాన్ అద్భుత విజ‌యం.. ట్రాట్‌కు ఘన వీడ్కోలు

Published on Thu, 02/19/2026 - 23:02

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 టోర్నీ అఫ్గానిస్తాన్ అద్భుత‌మైన విజ‌యంతో ముగించింది. చెన్నై వేదికగా కెన‌డాతో జ‌రిగిన త‌మ చివ‌రి మ్యాచ్‌లో రషీద్ సేన ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత  20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెన‌ర్ ఇబ్రహీం జద్రాన్ మ‌రోసారి సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. జ‌ద్రాన్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 95 ప‌రుగులు చేసి అజేయంగా  నిలిచాడు. అత‌డితో పాటు సెదికుల్లా అటల్(44), రెహ్మ‌నుల్లా గుర్బాజ్‌(30) రాణించారు. కెన‌డా బౌల‌ర్ల‌లో జస్కరన్ సింగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. డిలాన్ హీలిగర్ ఓ వికెట్ సాధించాడు.

న‌బీ మ్యాజిక్‌
అనంత‌రం 201 ప‌రుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన కెన‌డా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 118 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. అఫ్గాన్ స్పిన్న‌ర్ మ‌హ్మ‌ద్ నబీ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి కెన‌డాను దెబ్బ తీశాడు. అత‌డితో పాటు ర‌షీద్ ఖాన్ రెండు, ముజీబ్‌, అజ్మ‌తుల్లా త‌లా వికెట్ సాధించారు.

కెనడా బ్యాట‌ర్ల‌లో హర్ష్ ఠాకర్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మిగిలిన బ్యాటర్లు ఎవరూ అఫ్గాన్ బౌలింగ్‌ను ఎదుర్కొలేక‌పోయారు. కాగా ఇప్ప‌టికే అఫ్గాన్ జ‌ట్టు కివీస్‌, సౌతాఫ్రికా చేతిలో ఓట‌మి పాలై సూప‌ర్-8కు అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. మ‌రోవైపు అఫ్గానిస్తాన్ హెడ్‌కోచ్‌గా జోనాథన్ ట్రాట్ ప్ర‌యాణం ముగిసింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు ట్రాట్ ముందే ప్ర‌క‌టించాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)