Breaking News

SA Vs Nepal: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి!

Published on Sat, 06/15/2024 - 09:17

టీ20 ప్రపంచకప్‌-2024 లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌ జట్టు సౌతాఫ్రికాకు చెమటలు పట్టించింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపి.. చివరికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.

అయితే.. నువ్వా-నేనా అన్నట్లుగా పటిష్ట ప్రొటిస్‌ జట్టుతో విజయం కోసం నేపాల్‌ జట్టు పోరాడిన తీరు మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది.

వరల్డ్‌కప్‌-2024 లీగ్‌ దశలో బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌, శ్రీలంకతో కలిసి గ్రూప్‌-డిలో ఉన్న సౌతాఫ్రికా ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌-8కు చేరుకుంది. మరోవైపు.. నేపాల్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.

సౌతాఫ్రికాకు చుక్కలు చూపించి
ఇలాంటి దశలో నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు చుక్కలు చూపించి సత్తా చాటింది. సెయింట్‌ విన్సెంట్‌ వేదికగా శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నేపాల్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

స్పిన్నర్‌ కుశాల్‌ భూర్తేల్‌(4/19), పేసర్‌ దీపేంద్ర సింగ్‌(3/21) సంచలన ప్రదర్శన కనబరిచారు. అద్భుత స్పెల్స్‌తో సౌతాఫ్రికాను 115 పరుగులకు కట్టడి చేశారు. ప్రొటిస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌(43) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌(18 బంతుల్లో 27 నాటౌట్‌) రాణించాడు.

 

 ఇక లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌ను సౌతాఫ్రికా స్పిన్నర్‌ తబ్రేజ్‌ షంసీ ఆదిలోనే దెబ్బకొట్టినా.. ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్‌(49 బంతుల్లో 42) పట్టుదలగా నిలబడ్డాడు. అతడికి తోడుగా అనిల్‌ సా(27) రాణించాడు.

 

అయితే, మిగతా బ్యాటర్ల నుంచి వీరికి సహకారం అందలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నేపాల్‌ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.

ఇక నేపాల్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చిన తబ్రేజ్‌ షంసీ(4/19) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

నేపాల్‌పై విజయంతో గ్రూప్‌ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికా.. పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌ తొమ్మిదో ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

సౌతాఫ్రికా వర్సెస్‌ నేపాల్‌ స్కోర్లు
సౌతాఫ్రికా- 115/7 (20)
నేపాల్‌- 114/7 (20)
ఫలితం- ఒక్క పరుగు తేడాతో నేపాల్‌పై సౌతాఫ్రికా గెలుపు.‌ 

చదవండి: T20 WC: పాకిస్తాన్‌కు చావు దెబ్బ.. ప్రపంచకప్‌ టోర్నీ నుంచి అవుట్‌

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)