Breaking News

టీ20 వరల్డ్‌కప్‌లో సిక్సర్ల సునామీ.. మనోళ్లు ఒక్కరూ లేరు!

Published on Sat, 06/22/2024 - 12:10

అమెరికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయీ హోప్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు.

కేవలం 39 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌-2024 సూపర్‌-8లో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించాడు.

ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ టోర్నీలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్‌ అంటే పూనకం వచ్చినట్లుగా బ్యాట్‌తో రెచ్చిపోయే విండీస్‌ వీరుల జాబితాలో చేరాడు.

ఇక బార్బడోస్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అద్బుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న విండీస్‌ స్పిన్నర్‌ రోస్టన్‌ చేజ్‌(3/19) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ బ్యాటర్ల సిక్సర్ల హవా
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే
👉క్రిస్‌ గేల్(వెస్టిండీస్‌)‌- 11.. ఇంగ్లండ్‌ మీద
👉క్రిస్‌ గేల్(వెస్టిండీస్‌)‌- 10.. సౌతాఫ్రికా మీద
👉ఆరోన్‌ జోన్స్‌(అమెరికా)- 10.. కెనడా మీద
👉రిలీ రొసోవ్‌(సౌతాఫ్రికా)-8.. బంగ్లాదేశ్‌ మీద
👉నికోలస్‌ పూరన్‌(వెస్టిండీస్‌)-8.. అఫ్గనిస్తాన్‌ మీద
👉షాయీ హోప్‌(వెస్టిండీస్‌)-8.. అమెరికా మీద..

టీ20 వరల్డ్‌కప్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు
👉నికోలసన్‌ పూరన్‌(వెస్టిండీస్‌)- 17(2024 ఇప్పటి వరకు)
👉క్రిస్‌ గేల్‌(వెస్టిండీస్‌)- 16(2012)
👉మార్లన్‌ సామ్యూల్స్‌- 15(2012)
👉షేన్‌ వాట్సన్‌- 15(2012).
 చదవండి: టీమిండియా స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్‌ నాటికి!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)