Breaking News

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సంచ‌ల‌నం.. ఆసీస్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్‌

Published on Sun, 06/23/2024 - 09:31

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ప‌టిష్ట ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కింగ్‌స్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై 21 ప‌రుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ విజ‌యంతో త‌మ సెమీస్ ఆశ‌ల‌ను అఫ్గానిస్తాన్ స‌జీవంగా ఉంచుకుంది. 150 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల దాటికి 127 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఓ ద‌శ‌లో క్రీజులో మాక్స్‌వెల్ ఉన్న‌ప్పుడు ఆసీస్‌దే విజ‌యమ‌ని అంతా భావించారు. 

కానీ అఫ్గాన్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్.. మాక్సీని ఔట్ చేసి మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాడు. ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో నైబ్ త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 20 ప‌రుగులిచ్చి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. నైబ్‌తో పాటు నవీన్‌ ఉల్‌ హక్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ బ్యాట‌ర్ల‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌(59) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అఫ్గాన్‌ ఓపెనర్లు గుర్బాజ్‌(60), ఇబ్రహీం జద్రాన్‌(51) పరుగులతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో కమ్మిన్స్‌ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా రెండు, స్టోయినిష్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)