Breaking News

T20 World Cup 2024: అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్‌

Published on Tue, 06/04/2024 - 15:42

ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్‌ ఫజల్‌ హక్‌ ఫారూఖీ టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఉగాండతో ఇవాళ (జూన్‌ 4) జరిగిన మ్యాచ్‌లో ఫజల్‌ హక్‌ 4 ఓవర్లు బౌల్‌ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఓ ఫాస్ట్‌ బౌలర్‌కు ఇవి రెండో అత్యుత్తమ గణాంకాలు. 

2009లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఉమర్‌ గుల్‌ న్యూజిలాండ్‌పై కేవలం 6 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో ఓ ఫాస్ట్‌ బౌలర్‌కు ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు శ్రీలంక స్పిన్నర్‌ అజంత మెండిస్‌ పేరిట నమోదై ఉన్నాయి. 2012 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెండిస్‌ 8 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 

మెండిస్‌ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు కూడా లంక బౌలర్‌ పేరిటే నమోదై ఉన్నాయి. 2014 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక స్పిన్నర్‌ రంగన హెరాత్‌ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉంటే, ఉగాండతో జరిగిన నేటి మ్యాచ్‌లో ఫజల్‌ హక్‌ ఫారూఖీ విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్‌ (76), ఇబ్రహీం జద్రాన్‌ (70) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. ఉగాండ బౌలర్లలో కోస్మాస్‌ క్యేవుటా, మసాబా తలో 2 వికెట్లు పడగొట్టారు.

184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ.. ఫజల్‌ హక్‌తో పాటు నవీన్‌ ఉల్‌ హక్‌ (2-0-4-2), రషీద్‌ ఖాన్‌ (4-0-12-1), ముజీబ్‌ (3-0-16-1) విజృంభించడంతో 16 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. ఉగాండ ఇన్నింగ్స్‌లో రియాజత్‌ అలీ షా (11), రాబిన్సన్‌ ఒబుయా (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)