Breaking News

IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు

Published on Mon, 10/25/2021 - 17:39

Virender Sehwag And Irfan Pathan Stand By Mohammed Shami Amid Online Attack: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి భారత ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీయే కారణమంటూ కొందరు దురాభిమానులు నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా షమీపై జరుగుతున్న ఈ దాడిని టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ ఖండించారు.

షమీపై దాడి దిగ్భ్రాంతికరమని, జట్టు మూకుమ్మడిగా విఫలమైతే షమీ ఒక్కడు మాత్రం ఏం చేయగలడని మద్దతుగా నిలిచారు. షమీ ఓ ఛాంపియన్‌ బౌలర్‌ అని.. టీమిండియా క్యాప్‌ ధరించిన ప్రతి ఆటగాడు తమ హృదయాల్లో భారతీయత కలగి ఉంటాడని.. షమీ తర్వాతి మ్యాచ్‌లో రెచ్చిపోవాలని ఆకాంక్షించారు. గతంలో టీమిండియా.. పాక్‌ చేతిలో ఓడినప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని, కొందరు అల్లరి మూకులు ఉద్దేశపూర్వకంగా మాటల దాడులకు తెగబడుతున్నారని, ఇది ఏ మాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

ఇదే అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సైతం స్పందించారు. ఆటలో గెలుపోటములు సహజమని, జట్టులో 11 మంది సభ్యులుంటే, ఒక్కరినే టార్గెట్‌ చేయడం కరెక్ట్‌ కాదని అన్నారు. నెట్టింట జరుగుతున్న ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, పాక్‌తో జరిగిన మ్యాచ్‌ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో షమీ 3.5 ఓవర్లు బౌల్‌ చేసి ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. 
చదవండి: టీమిండియాతో మ్యాచ్‌: పాక్‌ మినిస్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Videos

ఒంటరిగా ఎదుర్కోలేక.. దుష్ట కూటమిగా..!

జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవేట

నేడు యాదగిరి గుట్ట, పోచంపల్లిలో అందాల భామల పర్యటన

శత్రు డ్రోన్లపై మన భార్గవాస్త్రం

ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు

మద్యం కేసులో బాబు బేతాళ కుట్ర మరోసారి నిరూపితం

సచిన్, విరాట్ తర్వాత నంబర్-4 పొజిషన్ ఎవరిది?

ఆపరేషన్ సిందూర్ తో మరోసారి లెక్క సరిచేసిన భారత్

మాధవి రెడ్డీ.. ఇది జగన్ అడ్డా.. నీ ఆటలు సాగవు

కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేత హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నట్లు టాక్

Photos

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)