Breaking News

ఐపీఎల్‌ ఆడుతుండగానే మరో జాక్‌పాట్‌ కొట్టిన సీఎస్‌కే చిచ్చరపిడుగు

Published on Thu, 05/08/2025 - 15:06

సీఎస్‌కే చిచ్చరపిడుగు ఆయుశ్‌ మాత్రే ఐపీఎల్‌ 2025 ఆడుతుండగానే మరో జాక్‌ పాట్‌ కొట్టాడు. నిన్న (మే 7) జరిగిన ముంబై టీ20 లీగ్‌ వేలంలో మాత్రేకు భారీ ధర దక్కింది. మాత్రేను ట్రయంప్‌ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ ఫ్రాంచైజీ రూ. 14.75 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో మాత్రే నాలుగో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 

వేలంలో అత్యధిక మొత్తం అథర్వ అంకోలేకర్‌కు దక్కింది. అంకోలేకర్‌ను ఈగల్‌ థానే స్ట్రయికర్స్‌ ఫ్రాంచైజీ రూ. 16.25 లక్షల ధరకు సొంతం​ చేసుకుంది. అంకోలేకర్‌ తర్వాత అత్యధిక బిడ్డింగ్‌ ముషీర్‌ ఖాన్‌, సాయిరాజ్‌ పాటిల్‌కు దక్కింది. ముషీర్‌ను ఏఆర్‌సీఎస్‌ అంధేరి.. సాయిరాజ్‌ను ఈగల్‌ థానే స్ట్రయికర్స్‌ రూ. 15 లక్షలకు దక్కించుకున్నాయి.

వీరి తర్వాత వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కేకేఆర​ ప్లేయర్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశీ నిలిచాడు. రఘువంశీని ముంబై ఫాల్కన్స్‌ రూ. 14 లక్షలకు దక్కించుకుంది. షమ్స్‌ ములానీకి 14 లక్షలు, సూర్యాంశ్‌ షేడ్గేకు రూ. 13.75 లక్షలు లభించాయి.

కాగా, ముంబై టీ20 లీగ్‌ ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఎనిమిది జట్లు నిన్న జరిగిన వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఒక్కో జట్లు గరిష్ఠంగా 18 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి జట్టు ఓ ఐకాన్‌ ఆటగాడిని ఎంపిక చేసుకుంది. ఐకాన్‌ ఆటగాడికి రూ. 20 లక్షలు లభిస్తాయి. 

సూర్యకుమార్‌ యాదవ్‌ (ముంబై నార్త్‌ ఈస్ట్‌), అజింక్య రహానే (బాంద్రా బ్లాస్టర్స్‌), పృథ్వీ షా (ముంబై పాంథర్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (ముంబై ఫాల్కన్స్‌),శివమ్‌ దూబే (అంధేరి), శార్దూల్‌ ఠాకూర్‌ (థానే స్ట్రయికర్స్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (ముంబై సబర్బ్స్‌), తుషార్‌ దేశ్‌పాండే (మరాఠ రాయల్స్‌) ఐకాన్‌ ప్లేయర్స్‌గా ఎంపికయ్యారు. ఈ లీగ్‌ మే 26 నుంచి జూన్‌ 8 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది.

జట్ల వివరాలు..
ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్ 
ఐకాన్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్ (20 లక్షలు) 
ప్లేయర్స్: సిధాంత్ ఆధత్రావ్ (7.75 లక్షలు), ఆయుష్ మాత్రే (14.75 లక్షలు), సూర్యాంశ్ షెడ్గే (13.75 లక్షలు), పరీక్షిత్ వల్సంకర్ (7.25 లక్షలు), జే జైన్‌ (4 లక్షలు), హృషికేశ్‌ గోరే (3.40 లక్షలు), ఆకాష్ పవార్ (3 లక్షలు), శ్రేయాస్ గురవ్ (3 లక్షలు), భరత్ సుదమ్ పాటిల్ (2 లక్షలు), మకరంద్ పాటిల్ (2 లక్షలు)

బాంద్రా బ్లాస్టర్స్ 
ఐకాన్ ప్లేయర్: అజింక్యా రహానే (20 లక్షలు) 
ప్లేయర్లు: సువేద్ పార్కర్ (8.50 లక్షలు), ఆకాశ్ ఆనంద్ (8.25 లక్షలు), రాయ్‌స్టన్‌ డయాస్‌ (7 లక్షలు), కర్ష్‌ కొఠారి (5 లక్షలు), తుషార్ సింగ్ (3 లక్షలు), అథర్వ పూజారి (3 లక్షలు), ఓం కేష్‌కామత్ (3.20 లక్షలు), ధనిత్ రౌత్ (4.60 లక్షలు), నమన్ పుష్పక్ (3 లక్షలు), పార్థ్ అంకోలేకర్ (3 లక్షలు), అతిఫ్ హబీబ్ అత్తర్వాలా (6.25 లక్షలు), ద్రుమిల్ మత్కర్ (7.25 లక్షలు), మహ్మద్ అదీబ్ వాసియుల్ ఉస్మాని (2.70 లక్షలు)

నార్త్ ముంబై పాంథర్స్ 
ఐకాన్ ప్లేయర్: పృథ్వీ షా (20 లక్షలు)
ప్లేయర్స్: తనుశ్‌ కోటియన్‌ (10 లక్షలు), మోహిత్ అవస్తీ (10.50 లక్షలు), ఖిజార్ దఫేదార్ (5.50 లక్షలు), దివ్యాంష్ సక్సేనా (5.25 లక్షలు), అభిజ్ఞాన్ కుందు (5 లక్షలు), ఆయుష్ వర్తక్ (6.25 లక్షలు), సౌరభ్ సింగ్ (3 లక్షలు), హర్షల్ జాదవ్ (5 లక్షలు), ప్రిన్స్ దేవాంగ్ షైక్ (2 లక్షలు), షాలిక్ జౌక్‌ల్ (2 లక్షలు), అలీమ్ (3.40 లక్షలు), ముజామిల్ కద్రి (2 లక్షలు)

SoBo ముంబై ఫాల్కన్స్ 
ఐకాన్ ప్లేయర్: శ్రేయాస్ అయ్యర్ (20 లక్షలు) 
ప్లేయర్స్: అంగ్క్రిష్ రఘువంశీ (14 లక్షలు), వినాయక్ భోయిర్ (5.75 లక్షలు), సిద్ధార్థ్ రౌత్ (7 లక్షలు), హర్ష్ అఘవ్ (5.25 లక్షలు), కుష్ కరియా (3 లక్షలు), నిఖిల్ గిరి (3 లక్షలు), ప్రేమ్ దేవ్కర్ (3 లక్షలు), ఆకాశ్ పార్కర్ (11.25 లక్షలు), అమోల్ టార్పురే (3 లక్షలు), ఇషాన్ ముల్చందని (3.40 లక్షలు), మయూరేశ్‌ తండేల్‌ (2 లక్షలు)

ARCS అంధేరీ 
ఐకాన్ ప్లేయర్: శివమ్ దూబే (20 లక్షలు) 
ప్లేయర్లు: ప్రసాద్ పవార్ (13 లక్షలు), ముషీర్ ఖాన్ (15 లక్షలు), హిమాన్షు సింగ్ (5.50 లక్షలు), అఖిల్ హెర్వాద్కర్ (6.50 లక్షలు), సిద్దిద్ తివారీ (3 లక్షలు), ప్రవార్జా (3 లక్షలు), రజారీ 3 లక్షలు (3 లక్షలు), సాక్షం ఝా (3.60 లక్షలు), ప్రసూన్ సింగ్ (3 లక్షలు), ఐశ్వరీ సర్వే (2 లక్షలు), అజయ్ మిశ్రా (2 లక్షలు), బద్రే ఆలం (2.50 లక్షలు), మొయిన్ ఖాన్ (2 లక్షలు), మోనిల్ సోనీ (2.20 లక్షలు)

ఈగిల్ థానే స్ట్రైకర్స్ 
ఐకాన్ ప్లేయర్: శార్దూల్ ఠాకూర్ (20 లక్షలు) 
ప్లేయర్లు: శశాంక్ అత్తార్డే (6.50 లక్షలు), సాయిరాజ్ పాటిల్ (15 లక్షలు), అథర్వ అంకోలేకర్ (16.25 లక్షలు), హర్ష్ తన్నా (16.25 లక్షలు), హర్ష్ తన్నా (7.7 లక్షలు), రవీంద్ర కుమార్ యాదవ్ (3.80 లక్షలు), ఆర్యన్ చౌహాన్ (3 లక్షలు), హర్ష్ సలుంఖే (3 లక్షలు), నూతన్ గోయెల్ (3.20 లక్షలు), ఆర్యరాజ్ నికమ్ (2.10 లక్షలు), అమర్త్య రాజే (2 లక్షలు), కౌశిక్ చిఖాలికర్ (2 లక్షలు)

ఆకాశ్ టైగర్స్ ముంబయి సబర్బ్స్ 
ఐకాన్‌ ప్లేయర్: సర్ఫరాజ్ ఖాన్ (20 లక్షలు)
ప్లేయర్లు:  హార్దిక్‌ తామోర్‌ (8.50 లక్షలు), జే బిస్తా (12 లక్షలు), షమ్స్ ములానీ (14 లక్షలు), సిల్వెస్టర్ డిసౌజా (5 లక్షలు), అయాజ్ అహ్మద్ అఫ్జల్ అహ్మద్ ఖ్ (5.25 లక్షలు), సిద్ధార్థ్ అక్రే (4.60 లక్షలు), అర్జున్ డాని (4.20 లక్షలు), మహమ్మద్ యాసీన్ సౌదాగర్ (3 లక్షలు), జైద్ పాటంకర్ (3.60 లక్షలు), కరణ్ షా (2 లక్షలు), కృతిక్ శంకరప్ప హనగవాడి (2 లక్షలు)

ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ 
ఐకాన్‌ ప్లేయర్‌: తుషార్‌ దేశ్‌పాండే (20 లక్షలు)
ప్లేయర్లు: సిద్దేశ్‌ లాడ్ (10.25 లక్షలు), సచిన్ యాదవ్ (7 లక్షలు), ఆదిత్య ధుమాల్ (7.25 లక్షలు), ఖాన్ అవైస్ నౌషాద్ (4.20 లక్షలు), సాహిల్ జాదవ్ (3 లక్షలు), నమన్ ఝవార్ (3 లక్షలు), మాక్స్‌వెల్ స్వామినాథన్ (4.60 లక్షలు), వరుణ్ రావ్ (3 లక్షలు), రోహన్ ఘాగ్ (3 లక్షలు), అజయ్‌ సింగ్‌ జానూ (2.20 లక్షలు), చిన్మయ్‌ సుతార్‌ (5 లక్షలు), ఇర్ఫాన్‌ ఉమెయిర్‌ (9.25 లక్షలు), పరాగ్ ఖానాపుర్కార్‌ (6 లక్షలు)
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)