Breaking News

బంతితో రాణించిన వెంకటేశ్‌ అయ్యర్‌

Published on Fri, 12/13/2024 - 18:18

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్‌ ఆటగాడు, టీమిండియా ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ బంతితో రాణించాడు. ఢిల్లీతో ఇవాళ (డిసెంబర్‌ 13) జరిగిన మ్యాచ్‌లో అయ్యర్‌ రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. 

అయ్యర్‌తో పాటు కుమార్‌ కార్తికేయ (3-0-23-1), ఆవేశ్‌ ఖాన్‌ (4-0-36-1), త్రిపురేశ్‌ సింగ్‌ (3-0-18-1) వికెట్లు తీయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. 

అనుజ్‌ రావత్‌ (33 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ప్రియాన్ష్‌ ఆర్య 29, యశ్‌ ధుల్‌ 11, ఆయుశ్‌ బదోని 19, హిమ్మత్‌ సింగ్‌ 15, మయాంక్‌ రావత్‌ 24, హర్ష్‌ త్యాగి 9 (నాటౌట్‌) పరుగులు చేశారు.  

ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బరోడాపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శాశ్వత్‌ రావత్‌ (33), కృనాల్‌ పాండ్యా (30), శివాలిక్‌ శర్మ (26 నాటౌట్‌), అథీత్‌ సేథ్‌ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హార్దిక్‌ పాండ్యా 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.

159 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. రహానేకు జతగా శ్రేయస్‌ అయ్యర్‌ (46) కూడా కాసేపు మెరుపులు మెరిపించాడు.

భీకర ఫామ్‌లో రహానే
ముంబై వెటరన్‌ అజింక్య రహానే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బరోడాతో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్న రహానే.. ఈ టోర్నీలో గత ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్‌ సెంచరీలు చేశాడు.

గత ఆరు మ్యాచ్‌ల్లో రహానే చేసిన స్కోర్లు..
- 52(34) vs మహారాష్ట్రపై
- 68(35) vs కేరళపై 
- 22(18) vs సర్వీసెస్‌పై
- 95(53) vs ఆంధ్రపై
- 84(45) vs క్వార్టర్‌ ఫైనల్లో విదర్భపై
- 98(57) vs సెమీస్‌లో బరోడాపై

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)