Breaking News

విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన కివీస్‌ క్రికెటర్‌.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా..

Published on Mon, 10/16/2023 - 15:48

న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ సుజీ బేట్స్‌ చరిత్ర సృష్టించింది. టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కివీస్‌ మహిళా జట్టు.. ప్రొటిస్‌ మహిళా జట్టుతో ఆదివారం ఐదో టీ20లో తలపడింది.

ఇందులో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.  ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో కివీస్‌ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది.

ఓపెనర్‌ కేట్‌ ఆండర్సన్‌ 11 పరుగులకే పెవిలియన్‌ చేరినప్పటికీ మరో ఓపెనర్‌ సుజీ బేట్స్‌(45)తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ అమీలియా కెర్‌(61) జోరును కొనసాగించింది. కానీ సుజీ అవుటైన తర్వాత అమీలియాకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు.

మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ మొత్తం సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం కావడంతో అమీలియా ఆఖరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసిన కివీస్‌ మహిళా జట్టు 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఇక వర్షం కారణంగా తొలి మూడు టీ20లలో ఫలితం తేలకపోవడంతో.. నాలుగు, ఐదు మ్యాచ్‌లలో గెలిచిన న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా సిరీస్‌ను 1-1తో పంచుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా సుజీ బేట్స్‌ అరుదైన ఘనత సాధించింది. 42 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 45 పరుగులు రాబట్టిన ఈ కుడిచేతి వాటం గల బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అంతర్జాతీయ టీ20లలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

ఇప్పటి వరకు మొత్తంగా 149 టీ20లు ఆడిన సుజీ బేట్స్‌ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా 4021 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న రికార్డు బ్రేక్‌ చేసింది. కాగా కోహ్లి 115 మ్యాచ్‌లలో 37 అర్ధ శతకాలు, ఒక సెంచరీ సాయంతో 4008 పరుగులు చేశాడు.

తన ఖాతాలోనూ ఓ శతకంతో పాటు 26 హాఫ్‌ సెంచరీలు జమ చేసుకున్న సుజీ ఈ మేరకు కోహ్లి రికార్డును సవరించింది. ఈ సందర్భంగా కివీస్‌ మహిళా జట్టును సూచించే వైట్‌ఫెర్న్స్‌ ఎక్స్‌ వేదికగా హర్షం వ్యక్తం చేసింది.

‘‘సరికొత్త చరిత్ర! బెనోనీలో జరిగిన మ్యాచ్‌లో సుజీ బేట్స్‌.. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఘనత సాధించింది. 

అంతేకాదు.. విరాట్‌ కోహ్లి(4008*)ని అధిగమించి ప్రస్తుతం ప్రపంచంలోనే టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది’’ అని సుజీకి శుభాకాంక్షలు తెలియజేసింది. 

కాగా పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ 3405 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 3154 రన్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది.  

చదవండి: Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)