ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌

Published on Sat, 01/24/2026 - 05:21

రాయ్‌పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో టీమిండియా అద‌ర‌గొట్టింది. బౌలింగ్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ములేపింది. కివీస్ నిర్ధేశించిన 209 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 15.2 ఓవ‌ర్ల‌లో చేధించింది.

త‌ద్వారా న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది.   త‌న రీఎంట్రీ మ్యాచ్‌లో విఫ‌ల‌మైన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌.. రాయ్‌పూర్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

కిషాన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 76 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌(37 బంతుల్లో 82 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన కిషన్‌పై సూర్య‌కుమార్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు.  పవర్‌ప్లేలో అతడు ఆడిన తీరు అద్భుతమని సూర్య‌కొనియాడాడు. 

"ఇషాన్ లంచ్‌లో ఏం తిన్నాడో, మ్యాచ్‌కు ముందు ఏ 'ప్రీ-వర్కౌట్' డ్రింక్ తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అత‌డి బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇలాంటి విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌ను నేను ఎప్పుడూ చూడ‌లేదు. ప‌వ‌ర్‌ప్లేలో తొలి రెండు ఓవ‌ర్ల‌లో మాకు కేవ‌లం 8 ప‌రుగుల‌కే వ‌చ్చాయి. అటువంటిది ప‌వ‌ర్‌ప్లేను 75 ప‌రుగుల‌తో ముగించ‌డం నిజంగా గ్రేట్‌. 

ఆ క్రెడిట్ మొత్తం కిష‌న్‌కే ద‌క్కాలి. 200 పైగా ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేట‌ప్పుడు బ్యాట‌ర్ల నుంచి ఇటువంటి ఇన్నింగ్స్‌లే మేము ఆశిస్తాము. ప్ర‌తీ ఒక్కరూ పూర్తి స్వేచ్చ‌గా ఆడుతూ తమను తాము నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఇషాన్ స‌రిగ్గా అదే చేశాడు.

ప‌వ‌ర్‌ప్లేలో ఇషాన్ స్ట్రైక్ అస్సలు నాకు ఇవ్వలేదు, అందుకు కోపంగా ఉన్నాను(న‌వ్వుతూ). అయితే కిషాన్ దూకుడుగా ఆడ‌డంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు స‌మ‌యం దొరికింది. చాలా రోజుల త‌ర్వాత హాఫ్ సెంచ‌రీ చేయ‌డం సంతోషంగా ఉంది. గ‌త మూడు వారాల నుంచి నెట్స్‌లో ఎక్కువ‌గా గ‌డిపాను. వాటి ఫ‌లితం ఈ మ్యాచ్‌లో స్ప‌ష్టంగా క‌న్పించింది.

ఒకానొక దశలో న్యూజిలాండ్ 230 ప‌రుగులు చేసేలా క‌నిపించింది. కానీ కుల్దీప్ యాద‌వ్‌, వ‌రుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్ధిని క‌ట్ట‌డి చేశారు. దూబే కూడా కీల‌క ఓవ‌ర్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. రాబోయో మ్యాచ్‌లలో ఇదే బ్రాండ్ ఆఫ్ కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)