Breaking News

ఉద్వాసనకు గురైన తర్వాత సూర్య మొదటి రియాక్షన్‌ ఇదే..!

Published on Sat, 06/06/2026 - 16:10

2026 టీ20 ప్రపంచకప్‌ గెలిపించిన తర్వాత కూడా టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు పడింది. త్వరలో జరుగబోయే ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్లలో అతనికి చోటు కూడా దక్కలేదు. కెప్టెన్‌గా ఉద్వాసన పలికినా, జట్టులో స్థానమైనా లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, సెలెక్టర్లు స్కైపై నిర్దయగా వ్యవహరించారు.

ఇంత అవమానం జరిగినా స్కై చాలా హుందాగా వ్యవహరించాడు. తన ఉద్వాసన వార్త వెలువడిన గంటలోపే సోషల్‌మీడియా వేదికగా భారత జట్టుకు శుభా​కాంక్షలు తెలిపాడు. "Wishing this highly skilled group all the best for challenges ahead" అంటూ పోస్ట్ చేశాడు.

స్కై పరిణితి, హుందాతనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. తనపై వేటు పడినా జట్టుకు శుభాకాంక్షలు తెలపడం అతని గొప్పతనం అంటూ కొనియాడుతున్నారు. భారత కెప్టెన్‌గా స్కైకు మంచి ట్రాక్‌ రికార్డే ఉన్నప్పటికీ, వ్యక్తిగంతా ఇటీవలికాలంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ కారణంగా బీసీసీఐ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది.

అతడి స్థానంలో నూతన కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు ఎంపిక చేసింది. భారత చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం భారత జట్లను ఇవాళ ప్రకటించాడు. ఈ మూడు జట్లకు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఎంపికయ్యాడు. 

అందరూ ఊహించిన విధంగానే యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ​కి తొలిసారి సీనియర్ జట్టులో చోటు లభించింది. వైభవ్‌ మూడు జట్లలో చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆటగాళ్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, తిలక్‌ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కించుకున్నారు. తిలక్‌కు జాక్‌పాట్‌ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్‌ డిప్యూటీగా ఎంపికయ్యాడు.

ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా

ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షియువం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వ‌రుణ్ చక్రవర్తి

ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టు
శ్రేయస్‌  అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), రవి బిష్ణోయి, అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జస్‌ప్రీత్‌ బుమ్రా, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, శివం దూబే, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ సూర్యవంశీ

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)