Breaking News

వారిద్ద‌రూ అద్భుతం.. కఠిన పిచ్‌పై కూడా అద‌ర‌గొట్టారు: సూర్య

Published on Fri, 02/13/2026 - 09:17

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గురువారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో నమీబియాను  93 ప‌రుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ స్పందించాడు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లోనూ విజయం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని సూర్య తెలిపాడు.

"ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించాం. జ‌ట్టు విజ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ వంతు పాత్ర పోషించారు. వాంఖ‌డే వికెట్‌పై బ్యాటింగ్ చేయ‌డం అంత సులువు కాదు. పిచ్ బ్యాటింగ్‌కు అంత‌ అనుకూలంగా లేన‌ప్ప‌టికి ఇషాన్, సంజూ మాత్రం మా ఇన్నింగ్స్‌ను ఘ‌నంగా ఆరంభించారు. అదేవిధంగా వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో  శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా నెల‌కొల్పిన భాగ‌స్వామ్యం మాకు చాలా కీల‌కంగా మారింది.

క్లిష్ట స‌మ‌యంలో వారిద్ద‌రూ బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం. ఒక దశలో 240-250 పరుగులు దాటుతామనిపించినా, నమీబియా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి మ‌మ్మ‌ల్ని క‌ట్ట‌డి చేశారు. జ‌స్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన కోటా 4 ఓవర్లను పూర్తి చేయడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. 

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా జ‌స్ప్రీత్ త‌న రిథ‌మ్‌ను కొన‌సాగిస్తాడ‌ని ఆశిస్తున్నాము. అలాగే స్పిన్ ద్వ‌యం వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్ర‌త్య‌ర్దుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. వారిద్ద‌రిది అద్భుతమైన కాంబినేషన్. హార్దిక్ పాండ్యా గురుంచి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

కొత్త బంతితో, పాత బంతితో గానీ బౌలింగ్ చేసేందుకు పాండ్యా ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మా త‌దుపరి మ్యాచ్‌లో కూడా ఇదే జోరును కొన‌సాగిస్తాము" అని సూర్య పోస్ట్ ప్రెజెంటేష‌న్‌లో పేర్కొన్నాడు. ఫిబ్ర‌వ‌రి 15న  కొలంబో వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాక్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

భార‌త్ ఆల్‌రౌండ్ షో..
ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. అనంత‌రం భారీ ల‌క్ష్య చేధ‌న‌లో 116 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)