Breaking News

టీమిండియాకు గుడ్ న్యూస్‌.. కెప్టెన్ సాబ్ ఫుల్ ఫిట్‌

Published on Sat, 08/16/2025 - 21:28

ఆసియాక‌ప్-2025కు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందింది. భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ప్ర‌స్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న సూర్య‌కుమార్ త‌న ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ను క్లియ‌ర్ చేశాడు. ఈ విష‌యాన్ని సూర్య అభిమానుల‌తో పంచుకున్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్, ముంబై టీ20 లీగ్ త‌ర్వాత సూర్య‌కుమార్‌ త‌న స్పోర్ట్స్ హెర్నియా గాయానికి జర్మనీలో శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాడు.

అనంత‌రం భార‌త్‌కు తిరిగొచ్చిన ఈ ముంబైక‌ర్‌ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఆగ‌స్టులో బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు సూర్య‌కుమార్ దూరం కానున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ టీమిండియా బంగ్లా టూర్ వాయిదా ప‌డ‌డంతో ఈ నెల ఆరంభంలో సూర్య‌కుమార్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) చేరాడు. 

ఈ నెల ఆరంభం నుంచి అక్క‌డే ఉన్న సూర్య త‌న ఫిట్‌నెస్‌ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్ర‌మించాడు. "కుడివైపు పొత్తికడుపు దిగువన స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స త‌ర్వాత నేను పూర్తిగా కోలుకున్నాను. ఈ విష‌యాన్ని మీకు తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నాను. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో సూర్య భాయ్ పేర్కొన్నాడు. 

కాగా ఆసియాకప్ కోసం భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. అనంతరం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు. ఇక ఈ ఖండంతార టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది.

ఆసియాకప్‌-2025కు భారత జట్టు(అంచనా)
సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, అక్షర్‌ పటేల్‌, అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, జితేశ్‌ శర్మ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)