అత‌డెందుకు దండ‌గ అన్నారు.. క‌ట్‌చేస్తే! గంభీర్ ప్లాన్ సూప‌ర్‌ స‌క్సెస్‌

Published on Sun, 07/28/2024 - 09:03

ప‌ల్లెకెలె వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన‌ తొలి టీ20లో 43 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లెయింగ్ ఎలెవ‌న్‌లో ఎంపిక చూసి మొద‌ట అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు. అందుకు కార‌ణం.. జింబాబ్వే సిరీస్‌లో దారుణంగా విఫ‌ల‌మైన రియాన్ ప‌రాగ్‌కు ఈ మ్యాచ్‌ తుది జ‌ట్టులో చోటివ్వ‌డ‌మే.

ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండ‌ర్లు శివ‌మ్ దూబే, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ల‌ను ప‌క్క‌న పెట్టి మ‌రి ప‌రాగ్‌కు ఛాన్స్ ఇచ్చిన జ‌ట్టు మెనెజ్‌మెంట్ చాలా మంది అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కానీ ప‌రాగ్‌కు తుది జ‌ట్టులో ఛాన్స్ ఇవ్వ‌డం వెన‌క హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాస్ట‌ర్ మైండ్ దాగి ఉంద‌ని మ్యాచ్ ఆఖ‌రిలో అంద‌రికి ఆర్ద‌మైంది.

ఈ మ్యాచ్‌లో రియాన్‌ను పార్ట్‌టైమ్ బౌలర్‌గా ఉప‌యోగించాల‌ని గంభీర్ ముందే నిర్ణ‌యించుకున్నాడంట‌. అందుకే ప‌రాగ్‌కే తొలి ప్రాధ‌న్య‌త‌ను గౌతీ ఇచ్చాడు. అయితే గౌతీ ప్లాన్ సూప‌ర్ స‌క్సెస్ అయిందే అనే చెప్పుకోవాలి. బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన రియాన్ ప‌రాగ్‌.. బౌలింగ్‌లో మాత్రం స‌త్తాచాటాడు. 

వికెట్ కాస్త స్పిన్‌కు అనుకూలించ‌డంతో లంక ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్ వేసేందుకు ప‌రాగ్‌ను కెప్టెన్ సూర్య‌కుమార్ తీసుకువ‌చ్చాడు. కెప్టెన్ న‌మ్మ‌కాన్ని ప‌రాగ్ వ‌మ్ము చేయ‌లేదు. త‌న వేసిన తొలి ఓవ‌ర్‌లో కీల‌కమైన వికెట్‌ను భార‌త్‌కు అందించాడు.

ఓవ‌రాల్‌గా  ఈ మ్యాచ్‌లో కేవ‌లం 1.2 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేసిన ఈ అస్సాం ఆల్‌రౌండ‌ర్‌..  5 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దీంతో గంభీర్ మాస్ట‌ర్ మైండ్ నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదే క‌దా గౌతీ మార్క్ అంటే పోస్ట్‌లు పెడుతున్నారు. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)