Breaking News

కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం

Published on Sat, 06/06/2026 - 20:56

భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ను ఇవాళ (జూన్‌ 6) తొలగించారు. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా అతడికి ఉద్వాసన పలికారు. కొత్త కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ పేరును ప్రకటించారు.

త్వరలో ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఎంపిక చేశారు. ఈ మూడు జట్లలో స్కైకు చోటు లభించలేదు. తనపై వేటు పడిన తర్వాత కూడా హుందాగా వ్యవహరించి, కొత్తగా ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన స్కై.. వేటు పడిన గంటల వ్యవధిలో బ్యాట్‌తో ఫైరయ్యాడు. 

టీ20 ముంబై లీగ్‌లో భాగంగా సోబో ముంబై ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రాత్రి) 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి (ట్రయంప్‌ నైట్స్‌ ఎంఎన్‌ఈ కెప్టెన్‌గా) వీరంగం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో స్కై ప్రత్యర్ది జట్టులో కొత్తగా ఎంపికై భారత టీ20 జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఉండటం మరో విశేషం. మ్యాచ్‌కు ముందు స్కై శ్రేయస్‌ను హత్తుకొని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ చూడచక్కని దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

ముంబై టీ20 లీగ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. సూర్య ఔటయ్యాక అతడి జట్టు గాడి తప్పింది. 19 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. స్కై క్రీజ్‌లో ఉన్నంతసేపు అతడి జట్టు భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు. 

తీరా చూస్తే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌ కూడా చేసేలా కనిపించడం లేదు. ప్రత్యర్ది జట్టు బౌలర్లలో ప్రథమేశ్‌ డాకే 3, యశ్‌ డిచోల్కర్‌ 2, సిద్దార్థ్‌ రౌత్‌, వేదాంత్‌ గోరే తలో వికెట్‌ తీసి స్కై జట్టును దెబ్బకొట్టారు. స్కై జట్టులో అతడితో పాటు అఖిల్‌ హెర్వాద్కర్‌ (12), నూతన్‌ కుమార్‌ గోయెల్‌ (34), మకరంద్‌ గిరీశ్‌ పాటిల్‌ (11) మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)