Breaking News

‘క్రికెట్‌’కు గుడ్‌బై చెప్పనున్న సురేశ్‌ రైనా!?

Published on Fri, 04/01/2022 - 15:29

టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా త్వరలో అన్ని రకాల క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధోనీతో పాటు సురేష్‌ రైనా 2020లో కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కానీ ఐపీఎల్‌లో మాత్రం ఆడుతూ వచ్చాడు. అయితే ఐపీఎల్‌-2022 మెగా వేలంలో సురేష్‌ రైనాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా రైనా మిగిలిపోయాడు. 

అయితే ఐపీఎల్‌ 15వ సీజన్‌లో రైనా కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. అతడితో పాటు పీయూష్ చావ్లా, ధవల్ కులకర్ణి, టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, హర్భజన్ సింగ్ తొలి సారి ఐపీఎల్‌లో కామెంటరీ ప్యానెల్‌లో చేరారు. ఇది ఇలా ఉంటే.. 11 సీజన్‌లలో చెన్నైసూపర్‌ కింగ్స్‌కు రైనా ప్రాతినిధ్యం వహించాడు.

మరోవైపు గుజరాత్‌ లయన్స్‌కు కెప్టెన్‌గా కూడా రైనా వ్యవహరించాడు. కాగా అతడి వయస్సు దృష్ట్యా క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని రైనా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రైనాకు 35 ఏళ్లు నిండాయి. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5528 పరుగులు సాధించాడు. అభిమానులు అతడిని ముద్దుగా మిస్టర్‌ ఐపీఎల్‌ అని పిలుచుకుంటారు.

చదవండి: IPL 2022: చెన్నై.. 19వ ఓవర్‌ శివమ్‌ దూబేతో వేయించడం సరైన నిర్ణయమే: టీమిండియా మాజీ క్రికెటర్‌

Videos

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)