Breaking News

'అతడొక గన్ ప్లేయర్‌.. కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి'

Published on Mon, 11/10/2025 - 14:08

ఐపీఎల్‌-2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. జడేజాకు బదులుగా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను సీఎస్‌కే తీసుకోవాలని నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో సీఎస్‌కే మాజీ బ్యాటర్‌, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కే కచ్చితంగా జడ్డూను తమతో పాటు అట్టిపెట్టుకోవాలని రైనా సూచించాడు. జడేజా ఐపీఎల్‌-2011 సీజన్ నుంచి సీఎస్‌కే జట్టులో కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌-2023 సీజ‌న్ విజేత‌గా సీఎస్‌కే నిల‌వ‌డంలో జ‌డ్డూది కీల‌క పాత్ర‌. 

ఫైన‌ల్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టుకు ఐదో టైటిల్‌ను అందించాడు. అంత‌కుముందు 2019, 2017 సీజ‌న్‌లో సీఎస్‌కే ఛాంపియ‌న్‌గా నిల‌వ‌డంలో జ‌డ్డూ త‌న వంతు పాత్ర పోషించాడు. అటువంటి ప్లేయ‌ర్‌ను వ‌దులుకోవ‌డానికి సీఎస్‌కే సిద్ద‌మైందంటే ఎవ‌రూ న‌మ్మ‌లేక‌పోతున్నారు.

ర‌వీంద్ర జ‌డేజాను సీఎస్‌కే రిటైన్ చేసుకోవాలి. అత‌డొక గ‌న్ ప్లేయ‌ర్‌. గ‌త కొన్ని సీజ‌న్ల‌గా సీఎస్‌కే ఎన్నో విజ‌యాల‌ను అందించాడు. కాబ‌ట్టి  'సర్ రవీంద్ర జడేజా' జట్టులో క‌చ్చితంగా ఉండాలి అని రైనా పేర్కొన్నాడు. అదేవిధంగా సీఎస్‌కే జట్టులో చేయాల్సిన మార్పులు కూడా అతడు సూచించాడు.

"చెన్నై డెవాన్ కాన్వేను జట్టు నుంచి విడుదల చేయాలి. సీఎస్‌కే కచ్చితంగా మినీ వేలంలో ఒక లోకల్ ఓపెనర్ కొనుగోలు చేసుకోవాలి. ఇక విజయ్ శంకర్‌, దీపక్ హుడాను కూడా రిలీజ్ చేయాలి. వీరిద్దరికి ఇప్పటికే చాలా అవకాశాలు లభించాయి. కానీ వాటిని వారు అందిపుచ్చుకోలేకపోయారు. ఈసారి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాలని" రైనా చెప్పుకొచ్చాడు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)