Breaking News

ధోని రిటైర్‌ అయితే బెటర్‌!.. సురేశ్‌ రైనా ‘షాకింగ్‌’ కామెంట్‌

Published on Tue, 05/06/2025 - 12:39

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni)కి వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా తలా విఫలమవుతున్నాడు. మరోవైపు.. జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది.

ఐదు మ్యాచ్‌ల తర్వాత రెగ్యులర్‌ కెప్టెన్‌‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) గాయం వల్ల సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో మరోసారి ధోని బాధ్యతలు చేపట్టాడు. కానీ అతడి సారథ్యంలోనూ కనీవినీ ఎరుగని రీతిలో కంచుకోట చెపాక్‌లో చెన్నై వరుస ఓటములు చవిచూసింది.

అంతేకాదు.. ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఇక గతేడాది కూడా సీఎస్‌కే ఇలాగే టాప్‌-4కు చేరకుండానే అవుటైన విషయం తెలిసిందే. వరుసగా ఇలా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌ చేరకపోవడం చెన్నై చరిత్రలోనే తొలిసారి ఇది.

వారిని వదిలించుకోండి
ఈ నేపథ్యంలో సీఎస్‌కే మెగా వేలం-2025లో అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర, రవిచంద్రన్‌ అశ్విన్‌, విజయ్‌ శంకర్‌ తదితరులను వదిలించుకుంటేనే చెన్నై జట్టు బాగుపడుతుందని వీరేందర్‌ సెహ్వాగ్‌ వంటి మేటి క్రికెటర్లు యాజమాన్యానికి సూచిస్తున్నారు.

ధోని రిటైర్‌ అయితే బెటర్‌
మరోవైపు.. వికెట్‌ కీపర్‌గా రాణిస్తున్నా.. బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని ఇక రిటైర్‌ పోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ సీజన్‌లో తలా ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 163 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్ట్రైక్‌రేటు 148.18.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఇక ధోని కనిపించకపోవచ్చన్న అభిప్రాయాల నడుమ.. టీమిండియా మాజీ క్రికెటర్‌, చెన్నై చిన్న తలా సురేశ్‌ రైనా చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

సురేశ్‌ రైనా ‘షాకింగ్‌’ కామెంట్‌
ఇటీవల ఫిల్మీజ్ఞాన్‌ షోలో పాల్గొన్న సురేశ్‌ రైనాకు.. ‘ధోని తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ వికెట్‌ కీపర్‌గా ఎవరుంటారు?’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే నాకూ తెలియదు. ఎందుకంటే.. ఎంఎస్‌ ధోని ఇంకో రెండేళ్ల పాటు సీఎస్‌కేకు ఆడతాడు’’ అంటూ అభిమానుకుల షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు రైనా.

కాగా ఐపీఎల్‌-2025లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కేవలం రెండు గెలిచి.. ఏకంగా తొమ్మిది ఓడిపోయింది. నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.

ఇక 43 ఏళ్ల ధోని విషయానికొస్తే.. ఐపీఎల్‌లో 275 మ్యాచ్‌లు ఆడి 5406 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 24 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు 38 ఏళ్ల సురేశ్‌ రైనా కూడా గతంలో చెన్నైకి ఆడిన విషయం తెలిసిందే. ఓవరాల్‌గా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 రన్స్‌ సాధించి.. మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరొందాడు.

చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్‌’!.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు