KKR Vs MI: సునీల్ న‌రైన్ అత్యంత చెత్త రికార్డు.. ప్ర‌పంచంలోనే తొలి క్రికెట‌ర్‌గా

Published on Sun, 05/12/2024 - 13:28

కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్‌ ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్‌ల‌గా వెనుదిరిగిన ప్లేయ‌ర్‌గా న‌రైన్ నిలిచాడు. 

ఐపీఎల్‌-2024లో భాగంగా  ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డ‌కౌటైన న‌రైన్‌.. ఈ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో న‌రైన్ ఇప్ప‌టివ‌ర‌కు 44 సార్లు ఖాతా తెర‌వ‌కుండానే ఔట‌య్యాడు. 

ఇంత‌కుముందు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ అలెక్స్ హెల్స్ పేరిట ఉండేది. హెల్స్ 43 సార్లు డ‌కౌట‌య్యాడు. తాజా మ్యాచ్‌తో హెల్స్‌ను నరైన్ అధిగ‌మించాడు. అదే విధంగా ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన రెండో ఆట‌గాడిగా పియూష్ చావ్లా స‌ర‌స‌న సునీల్ న‌రైన్ నిలిచాడు. 

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 16 సార్లు ఈ కరేబియ‌న్ ఆల్‌రౌండ‌ర్ డకౌట‌య్యాడు. దీంతో పాటు మ‌రో రికార్డును కూడా న‌రైన్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్( అంతర్జాతీయ, లీగ్‌లు)లో 550 లేదా అంత‌కంటే ఎక్కువ‌ వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు.  

ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 625 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అఫ్గాన్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ 574 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)