చరిత్ర సృష్టించిన సునీల్‌ నరైన్‌.. 17 ఏళ్ల ఐపీఎల్‌ హిస్టరీలోనే

Published on Tue, 04/16/2024 - 23:34

వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ సునీల్‌ నరైన్‌ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్‌ సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్‌గా వచ్చిన నరైన్‌.. రాజస్తాన్‌ బౌలర్లను ఊచకోత కోశాడు.

ఈ క్రమంలో కేవలం 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 56 బంతులు ఎదుర్కొన్న నరైన్‌ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. కాగా నరైన్‌కు ఇది తన కెరీర్‌లోనే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన నరైన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

నరైన్‌ సాధించిన రికార్డులు ఇవే..

►ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో సెంచరీతో పాటు క్యాచ్‌, వికెట్‌ పడగొట్టిన తొలి ప్లేయర్‌గా నరైన్‌ రికార్డులకెక్కాడు. కాగా 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఎవరికి ఈ ఘనత సాధ్యం కాలేదు.

►ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల హాల్‌తో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సునీల్ నరైన్‌ చరిత్ర సృష్టించాడు. 2012 ఐపీఎల్ సీజన్‍లో ఇదే ఈడెన్‌గార్డెన్స్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‍పై నరైన్ 5 వికెట్లతో ,చెలరేగాడు.

►ఐపీఎల్‍లో హ్యాట్రిక్‍తో పాటు సెంచరీ కూడా సాధించిన మూడో ప్లేయర్‌గా సునీల్ నరైన్‌ నిలిచాడు. 2013 ఐపీఎల్ సీజన్‍లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‍పై నరైన్ హ్యాట్రిక్ తీశాడు. ఇప్పుడు సెంచరీ చేయడంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  ఈ జాబితాలో  ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్ ఉన్నారు.

►ఐపీఎల్‌లో 100 వికెట్లతో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా నరైన్‌ రికార్డు సృష్టించాడు. నరైన్‌ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 170 వికెట్లు పడగొట్టాడు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)