మెడల్స్ ఏమీ లేవు.. ఇంత చెత్త ఫీల్డింగ్ చేస్తారా! గవాస్కర్‌ ఫైర్‌

Published on Sun, 06/22/2025 - 11:46

లీడ్స్ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. మొద‌టి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఇంగ్లీష్ జ‌ట్టు ధీటైన జవాబు ఇస్తుంది.  రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్‌(100), హ్యారీ బ్రూక్‌(0) ఉన్నారు. స్టోక్స్ సేన టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది.

బుమ్రా ఒక్క‌డే 
భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా ఒక్క‌డే మూడు వికెట్లు పడగొట్టి ఒంటరి పోరాటం చేశాడు.  సిరాజ్‌, జ‌డేజా, ప్ర‌సిద్ద్ కృష్ణ, శార్ధూల్‌ రెండో రోజు ఆటలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి ఓవర్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఆ తర్వాత కూడా తన పేస్ బౌలింగ్‌తో నిప్పులు చెరిగాడు.  అతడిని ఎదుర్కొవడానికి ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కానీ మిగితా ముగ్గురు పేస‌ర్లు వ‌న్డేను త‌ల‌పిస్తూ ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు.

ఆ మూడు క్యాచ్‌లు ప‌ట్టుంటే..
అయితే  ఈమ్యాచ్‌లో  బుమ్రాకు ఫీల్డర్ల నుంచి మద్దతు లభించి ఉంటే టీమిండియా క‌చ్చితంగా పైచేయి సాధించి ఉండేది. అతడి బౌలింగ్‌లో భారత ఫీల్డర్లు మొత్తం మూడు క్యాచ్‌లను జారవిడిచారు. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ ఐదో బంతికి డకెట్ ఇచ్చిన  క్యాచ్‌ను గల్లీలో యశస్వి జారవిడవగా... భారత అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకడైన జడేజా కూడా డకెట్‌ క్యాచ్‌ నేలపాలు చేశాడు.

డకెట్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్‌లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను సైతం జైస్వాల్‌ నేలపాలు చేశాడు.  దీంతో అతడు ఏకంగా సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో గిల్ సేన చెత్త ఫీల్డింగ్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.

"గత కొంత కాలంగా అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి డ్రెస్సింగ్ రూమ్‌లో అవార్డు ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. కానీ ఈ రోజు మాత్రం ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఎవరికి ఎటువంటి అవార్డు ఇవ్వడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారత ఫీల్డర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు.

యశస్వి జైస్వాల్ చాలా మంచి ఫీల్డర్, కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. రెండు క్యాచ్‌లను జారవిడిచాడు. నిజంగా ఇది నన్ను తీవ్ర నిరాశపరిచిందని" కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన జో రూట్‌.. సచిన్ రికార్డు బ్రేక్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)