ఈ ఆరు నెలల్లో మీరేం చేశారు.. కోచ్‌ల‌ను మారిస్తే బెట‌ర్‌: సునీల్ గవాస్కర్

Published on Mon, 01/06/2025 - 08:42

సిడ్నీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భార‌త్ ఓట‌మి చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పదేళ్ల త‌ర్వాత ప్ర‌తిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)ను ఆసీస్‌కు టీమిండియా స‌మ‌ర్పించుకుంది. బీజీటీ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ అవ‌కాశాలను సైతం రోహిత్ సేన చేజార్చుకుంది.

ఈ విజ‌యంతో ఆస్ట్రేలియా వ‌రుస‌గా రెండో సారి త‌మ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పదేళ్ల త‌ర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భార‌త జ‌ట్టుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్లేయ‌ర్స్‌తో పాటు జ‌ట్టు  మేనేజ్‌మెంట్‌ కూడా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. ఈ నేప‌థ్యంలో హెడ్‌కోచ్ గంభీర్ అండ్ కో పై  భార‌త మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిప‌డ్డాడు.

"అస్స‌లు కోచ్‌లు ఏం చేస్తున్నారు? న్యూజిలాండ్‌పై కేవలం 46 పరుగులకు ఆలౌట్ అయ్యాం. జట్టు బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అప్పుడే ఆర్దం చేసుకోవ‌చ్చు. కాబ‌ట్టి ఆస్ట్రేలియా సిరీస్‌కు స‌రైన ప్రణాళిక‌ల‌తో వెళ్లాల్సింది. కానీ కోచ్‌లు ఎటువంటి బాధ్యత తీసుకోలేదు. 

ఎందుకు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో కూడా బ్యాట‌ర్ల ఆట తీరు మెరుగు ప‌డలేదు? కచ్చితంగా ఈ ప్రశ్నకు కోచ్‌లే సమాధనమివ్వాలి. ఆట‌గాళ్ల‌తో పాటు కోచ్‌ల పనితీరును కూడా అంచనా వేయాలి. మంచి బౌలర్లను ఎలా ఉప‌యోగించుకోవాలో కోచ్‌లు ప్లాన్ చేయ‌లేదు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు బ్యాటింగ్‌ను ఆర్డ‌ర్‌ను మార్చారు. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌కు బదులుగా కోచ్‌లను మారిస్తే బెటర్ అన్పిస్తోంది.

ప్ర‌తీ ఒక్క‌రూ బ్యాట‌ర్ల‌ను మాత్ర‌మే త‌ప్పుబడుతున్నారు. కానీ కోచ్‌ల‌ను కూడా  ప్రశ్నించాలన్న‌ది నా అభిప్రాయం.  ఈ ఆరు నెలల్లో వారేమి చేశారో నాకు ఆర్ధం కావ‌డం లేదు. దీనికి వారే సమాధానం చెప్పాలి" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌న్నీ ఫైర‌య్యాడు. గంభీర్ నేతృత్వంలో పది టెస్టులు ఆడిన భారత్ ఆరింట ఓటమి చవిచూసింది. వరుసగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌లను కోల్పోయింది.
చదవండి: ధోని కెప్టెన్సీలో ఎంట్రీ.. కట్‌ చేస్తే! రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)