Breaking News

భార‌త్ ఓట‌మికి కార‌ణ‌మదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గ‌వాస్క‌ర్

Published on Tue, 07/15/2025 - 18:11

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో టెస్టులో 22 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. 193 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌లేక టీమిండియా చ‌త‌క‌ల‌ప‌డింది. ర‌వీంద్ర జ‌డేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన‌ బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో భార‌త్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది.

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చ‌ర్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బ్రైడ‌న్ కార్స్ రెండు వికెట్లు సాధించాడు. ఇక గిల్ సేన ఓట‌మిపై మ్యాచ్‌ అనంతరం భార‌త క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించారు. ల‌క్ష్య చేధ‌నలో బ్యాట‌ర్లు భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్ప‌క‌పోవ‌డం వ‌ల్ల భార‌త్ ఓటమి పాలైంద‌ని ఆయ‌న తెలిపారు.

"భార‌త రెండో ఇన్నింగ్స్‌లో క‌నీసం ఒక్క‌టైన 60 నుంచి 70 ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోదైంటే ఫ‌లితం మ‌రో విధంగా ఉండేది. కానీ భార‌త బ్యాట‌ర్లు అలా చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. స్పిన్న‌ర్లు జో రూట్, షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జ‌డేజా దూకుడుగా ఆడ‌లేద‌ని కొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు. 

కానీ ఆ స‌మ‌యంలో అత‌డు ఆడిన తీరు స‌రైన‌దే. ఎందుకుంటే బ‌య‌ట మ‌రో వికెట్ లేదు. జ‌డేజా పోరాటానికి పూర్తి మార్క్‌లు ఇవ్వాల్సిందేన‌ని" అధికారిక బ్రాడ్‌కాస్ట‌ర్ సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌న్నీ పేర్కొన్నారు. కాగా భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ సైతం త‌మ ఓట‌మికి కార‌ణం ఇదే చెప్పుకొచ్చాడు. 

ఒక 50 ప‌రుగుల భాగ‌స్వామ్యం వ‌చ్చి వున్నా తాము గెలిచే వాళ్ల‌మ‌ని గిల్ అన్నాడు. ఇక భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్ట‌ర్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టులోకి లైమ్ డాస‌న్ వచ్చాడు. భార‌త్ కూడా త‌మ తుది జ‌ట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
చదవండి: IND vs ENG: భార‌త్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్ రీఎంట్రీ

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు