Breaking News

ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచం: సూర్య భార్య భావోద్వేగం

Published on Sat, 09/14/2024 - 18:36

టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 34వ వసంతంలో అడుగుపెట్టాడు. అతడి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నూతన చైర్మన్‌గా ఎన్నికైన బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ తదితరులు సూర్యను విష్‌ చేశారు.

నా ప్రాణ స్నేహితుడు, నా ప్రపంచం
ఇక సూర్య భార్య దేవిశా శెట్టి తన మనసులోని భావాలు వెల్లడిస్తూ.. భావోద్వేగపూరిత నోట్‌తో హ్యాపీ బర్త్‌డే చెప్పింది. ‘‘నా ప్రాణ స్నేహితుడు, భర్త, ప్రేమికుడు.. నా ప్రపంచం.. నా జీవితంలో నేను తీసుకున్న సరైన నిర్ణయానికి నిదర్శనం.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో నా కోసం కేటాయిస్తున్న ప్రతి ఒక్క రోజుకు నేను రుణపడి ఉంటా!

ఈ ప్రపంచాన్ని నాకోసం అందంగా మలిచావు. అసలు నువ్వు లేకుండా నేను ఒక్క పనైనా చేయగలనా? ఇప్పుడూ.. ఎల్లప్పుడూ.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది. ఈ సందర్భంగా సూర్యతో దిగిన ఫొటోలను దేవిశా షేర్‌ చేయగా.. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఇక భార్య షేర్‌ చేసిన పోస్టుకు బదులుగా.. సుకూన్‌(శాంతి) అంటూ సూర్య బదులిచ్చాడు. కాగా కాలేజీలో తన జూనియర్‌ అయిన దేవిశాను ప్రేమించిన సూర్య.. పెద్దలను ఒప్పించి 2016, జూలై 7న ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

నాలుగు టీ20 సెంచరీలు
ఇక సూర్య కెరీర్‌ విషయానికొస్తే... టీమిండియా తరఫున ఇప్పటి వరకు 109 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్‌ యాదవ్‌.. 3213 పరుగులు చేశాడు. అత్యధికంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఎదిగి సత్తా చాటాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

టీమిండియా పూర్తిస్థాయి సారథిగా
ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ స్థానంలో సూర్య ఇటీవలే భారత టీ2 జట్టు సారథిగా నియమితుడయ్యాడు. శ్రీలంక పర్యటన సందర్భంగా పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి.. టీమిండియాకు 3-0తో క్లీన్‌స్వీప్‌ విజయం అందించాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న సూర్య.. అక్టోబరులో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

చదవండి: 'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)