Breaking News

గాల్లో ప్రాణాలు అంటే ఇదేనేమో.. బతికిపోయాడు!

Published on Mon, 07/03/2023 - 19:20

స్పిల్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఆస్ట్రియా జీపీ ఎఫ్‌-1 రేసులో ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. రేసును చూడడానికి చాలా మంది అభిమానులు రావడంతో వారిని ఎంటర్‌టైన్‌ చేసేందుకు నిర్వాహకులు.. స్టంట్‌మన్స్‌తో గాలిలో జెట్‌ప్యాక్స్‌తో కొన్ని స్టంట్స్‌ చేయించారు. సూపర్‌గా సాగుతూ మంచి ఎంటర్‌టైనింగ్‌ నడుస్తున్న సమయంలో ఊహించని రీతిలో ఒక స్టంట్‌మన్‌ జెట్‌ప్యాక్‌ ల్యాపింగ్‌ అయింది.

దీంతో ఒక్కసారిగా కంట్రోల్‌ తప్పిన స్టంట్‌మన్‌ నేరుగా రేసు నిర్వహించే ల్యాప్‌పై మూడు పల్టీలు కొట్టాడు. అంత పైనుంచి పడినా అదృష్టవశాత్తూ సదరు స్టంట్‌మన్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరికొద్ది నిమిషాల్లో రేసు ప్రారంభమవుతుందనగా ఇది చోటుచేసుకోవడంతో కాస్త ఆందోళన కలిగించినా.. ఆ స్టంట్‌మన్‌ తనంతట తానుగా లేచి వెళ్లిపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక రేసు విషయానికి వస్తే ఆదివారం ఆస్ట్రియన్‌ గ్రాండ్‌ప్రిలో  రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ను వెనక్కి నెట్టి తన వేగంతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో నిరుటి విజేత లెక్‌లెర్క్‌ రెండో స్థానంతో తృప్తి చెందాడు.పోల్‌ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్‌స్టాపెన్‌ 71 ల్యాపుల్ని అందరికంటే ముందుగా ఒక గంటా 25 నిమిషాల 33.607 సెకన్లలో పూర్తి చేశాడు.

ఈ సీజన్‌లో 25 ఏళ్ల ఈ డచ్‌ డ్రైవర్‌కిది వరుసగా ఐదో విజయం కాగా... ఓవరాల్‌గా ఇప్పటివరకు జరిగిన 9 రేసుల్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 377 పాయింట్లతో రెడ్‌బుల్‌ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జట్టుకు చెందిన సెర్గియో పెరెజ్‌ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి ఈ నెల 9న సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌పై జరుగుతుంది.  

చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ

అడవి రాముడు లింబా రామ్‌.. గురి పెట్టాడో..!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)