Breaking News

అదరగొట్టిన మార్కరమ్‌.. సన్‌రైజర్స్ తొలి విజయం

Published on Tue, 01/17/2023 - 12:55

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ విజయం సాధించింది. 159 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి ఈస్టర్న్ కేప్ 19.3 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి చేధించింది.

ఇక సన్‌రైజర్స్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్‌ ఎయిడెన్ మార్కరమ్‌ కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన మార్క్రమ్.. అనంతరం బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్‌ 7 ఫోర్లు సాయంతో 50 పరుగలు సాధించాడు.

అతడితో పాటు సరేల్ ఎర్వీ(41), స్టబ్స్‌(30) పరుగులతో రాణించారు. ఎంఐ కేప్‌టౌన్‌ బౌలర్లలో ఒడియన్‌ స్మిత్‌ మూడు, సామ్‌ కుర్రాన్‌ రెండు, రషీద్‌ ఖాన్‌ ఒక్క వికెట్‌ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ కేప్‌టౌన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.

కాగా కేప్‌టౌన్‌  52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రాసీ వాన్ డర్ డస్సెన్ (29), లిండే(63) అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. కాగా ఈస్టర్న్ కేప్ బౌలర్లలో బార్ట్‌మాన్ మూడు వికెట్లు, మగాల, మార్కరమ్‌ తలా రెండువికెట్లు పడగొట్టారు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్యకుమార్‌కు నో ఛాన్స్‌! కిషన్‌కు చోటు

Videos

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)