Breaking News

WTC Final: సౌతాఫ్రికా మాస్టర్ ప్లాన్‌.. ఇక ఆసీస్‌కు చుక్కలే

Published on Mon, 06/02/2025 - 12:32

వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్(WTC)-2025 ఫైన‌ల్‌కు స‌మ‌యం అస‌న్న‌మ‌వుతోంది. జూన్ 11 నుంచి 15 వ‌ర‌కు లార్డ్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తుది పోరులో ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ క్ర‌మంలో సౌతాఫ్రికా క్రికెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఈ ఫైన‌ల్ మ్యాచ్ కోసం త‌మ జ‌ట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గ‌జం స్టువర్ట్ బ్రాడ్‌ను సీఎస్ఎ (Cricket South Africa) నియ‌మించింది. ఫైన‌ల్ మ్యచ్‌కు రెండు రోజుల ముందు ప్రోటీస్ జ‌ట్టుతో బ్రాడ్ చేర‌నున్నాడు. లార్డ్స్ మైదానంలో పరిస్థితులపై బ్రాడ్‌కు పూర్తి స్ధాయి అవ‌గ‌హ‌న ఉంది. అత‌డు త‌న కెరీర్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఈ క్రికెట్ మ‌క్కాలో ఆడాడు.  ఈ నేప‌థ్యంలోనే అత‌డితో సీఎస్ఎ త‌మ కోచింగ్ స్టాప్‌లోకి చేర్చుకుంది.

రికార్డుల రారాజు..
కెరీర్‌లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్‌ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్‌ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్‌క్రమ్‌, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్‌హమ్‌, కేశవ్ మహారాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్‌.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆసీస్ జట్టు
ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కోన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, వెబ్‌స్టర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, హేజెల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లయన్, మాథ్యూ కుహ్నెమాన్

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)