Breaking News

చివరి బంతికి సిక్స్‌.. వికెట్‌ కూడా! వారెవ్వా బ్రాడీ! వీడియో వైరల్‌

Published on Tue, 08/01/2023 - 08:42

40 రోజుల పాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన యాషెస్‌ సిరీస్‌కు ఎండ్‌ కార్డ్‌ పడింది. లండన్‌ వేదికగా జరిగిన యాషెస్‌ ఐదో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 2-2తో సమమైంది. అయితే గత సిరీస్‌ను గెలిచిన ఆసీస్‌ వద్దే ‘యాషెస్‌’ ఉండిపోనుంది.  ఇక ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖ్వాజా(72), డేవిడ్‌ వార్నర్‌(60), స్టీవ్‌ స్మిత్‌(54) పరుగులతో రాణించినప్పటికీ.. ఓటమి మాత్రం తప్పలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్‌ అలీ మూడు, బ్రాడ్‌ రెండు వికెట్లు సాధించారు.

కెరీర్‌లో చివరి వికెట్‌
ఇక ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తన టెస్టు కెరీర్‌కు చిరస్మణీయ ముగింపు పలికాడు. తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడిన బ్రాడ్‌.. రెండు కీలక వికెట్లు పడగొట్టి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. క్రీజులో పాతుకుపోయిన ఆసీస్‌ బ్యాటర్‌ అలెక్స్‌ క్యారీని ఔట్‌ చేసి.. చారిత్రత్మక యాషెస్‌ సిరీస్‌ను సమం చేశాడు. ఆస్ట్రేలియా ఆఖరి రెండు వికెట్లు కూడా బ్రాడ్‌ సాధించినవే కావడం గమానార్హం.

కాగా బ్రాడ్ ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ చూడటానికి అతడి కుటంబ సభ్యులు స్టేడియంకి వచ్చారు. బ్రాడ్‌ తన కెరీర్‌ చివరి వికెట్‌ సాధించిగానే.. స్టాండ్స్‌లో ఉన్న అతడి కుటంబ సభ్యులు ఆనందంలో మునిగి తెలిపోయారు. కాగా అంతకుముందు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్‌లోఆఖరి బంతిని బ్రాడ్‌ అద్భుతమైన సిక్సర్‌ మలిచాడు. అదే అతడి కెరీర్‌లో చివరి బంతి కావడం గమానర్హం. అదే విధంగా బౌలింగ్‌లో కూడా ఆఖరి బంతిని వికెట్‌తోనే ముగించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రికార్డుల రారాజు..
కెరీర్‌లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్‌ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్‌ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: ENG vs AUS: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్‌ విడ్కోలు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)